
పై ఫొటోలో నెత్తి మీద కోతిని కూర్చొపెట్టుకుని పోజులిస్తోన్న పాపను గుర్తు పట్టారా? ఈ అమ్మాయి టాలీవుడ్ క్రేజీ అండ్ బోల్డ్ హీరోయిన్. అలాగనీ ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయలేదు. ఉన్నంతలో ది బెస్ట్ అనిపించుకునేలా నటించింది. కేవలం హీరోయిన్ గానే కాకుండా పాత్ర నచ్చితే సపోర్టింగ్ రోల్స్ లోనూ నటిస్తుందీ అందాల తార. కొన్ని సినిమాల్లో ట్రెడిషినల్ గా కనిపించిన ఈ ముద్దుగుమ్మ మరొకొన్ని చిత్రాల్లో బోల్డ్ అండ్ రొమాంటిక్ రోల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఒక సినిమాలో అయితే ఏకంగా వేశ్య పాత్రలో నటించి డేరింగ్ బ్యూటీ అనిపించుకుంది. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సొగసరికి కూడా మంచి పేరు వచ్చింది. రవితేజ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ క్యూటీని గుర్తు పట్టారా మరి? కొంచెం కష్టంగా ఉందా? అయితే ఆన్సర్ కూడా మేమే చెబుదాం లెండి. తను మరెవరో కాదు కేరాఫ్ కంచరపాలెం హీరోయిన్ ప్రణీత పట్నాయక్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో.
2018లో వచ్చిన కేరాఫ్ కంచర పాలెం సినిమాలో భార్గవి అనే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది ప్రణీత. దీని తర్వాత పలు సినిమాల్లో నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ ఆకట్టుకుందీ అందాల తార. దుల్కర్ సల్మాన్ సినిమా సీతారామం లో వేశ్య పాత్రను అద్భుతంగా పోషించి బోల్డ్ అండ్ డేరింగ్ బ్యూటీ అనిపించుకుంది. ఆ తర్వాత ‘నెట్’ సినిమాలో రాహుల్ రామకృష్ణ భార్యగా కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించింది. ఇటీవల సన్నీ డియోల్ నటించిన హిందీ సినిమా జాట్ లోనూ ఓ కీలక పాత్రలో మెరిసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
కేరాఫ్ కంచరపాలెం సినిమాలో..

Praneeta Patnaik
సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలోనూ ఈ ముద్దుగుమ్మకు మస్త్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ఇప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఫొటోలను చూస్తుంటే ఈ అమ్మాయి కేరాఫ్ కంచెరపాలెం లో నటించిన ఆ అమ్మాయినేనా? అంటూ ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. మరి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
గ్లామరస్ లుక్ లో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.