
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలేసింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ వరుస సినిమాలతో అగ్రకథానాయికగా దూసుకుపోయింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, రజినీకాంత్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతుంది. అప్పట్లో ఆమె డేట్స్ కోసం దర్శకనిర్మాతలు సైతం వెయిట్ చేసేవారు. నాలుగు పదుల వయసులోనూ ఆడపదపడపా చిత్రాల్లో నటిస్తుంది. అయితే ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా చిన్న చిన్న రోల్స్ పోషిస్తుంది. కొన్నాళ్లుగా ఈ అమ్మడుకు ఆశించిన స్తాయిలో సినిమా ఆఫర్స్ రావడం లేదు. దీంతో ఇండస్ట్రీలో సైలెంట్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. కట్ చేస్తే ఇప్పుడు స్పెషల్ సాంగ్ చేస్తుందని టాక్. తాజాగా ఓ హీరో సినిమా స్పెషల్ సాంగ్ చేసేందుకు రెడీ అయ్యిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా రెట్రో. ఇందులో సూర్య సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. మరో పది రోజుల్లో ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమా పై మంచి ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. అయితే లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ స్పెషల్ సాంగ్ చేయనుందట. ఈ సాంగ్ ఓ రేంజ్ లో ఉంటుందని చిత్రయూనిట్ అంటోంది. చాలా కాలం తర్వాత మరోసారి స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది శ్రియ.
దీంతో ఈ సినిమా తర్వాత శ్రియాకు మళ్లీ వరుస ఆఫర్స్ క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పటికే శ్రియాకు తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి పాలోయింగ్ ఉంది. ఇప్పటికే శ్రియా, సూర్య కాంబోలో రాబోతున్న స్పెషల్ సాంగ్ పై మేకర్స్ భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ సాంగ్ అంచనాలకు మించి ఉంటుందని టాక్.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..