
ప్రస్తుతం అతడు టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తొలి నాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆ కుర్రాడు.. హీరోగా ఎదిగి దూసుకుపోతున్నాడు. అక్కినేని నాగచైతన్యకు స్నేహితుడిగా కనిపించిన ఓ సాధారణ కుర్రాడు ఇప్పుడు బ్యాక్ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. విభిన్నమైన కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ ఫ్యామిలీ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా సినీప్రియులను అలరించేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త కథలను ఎంచుకుంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? వైవిధ్యమైన కథలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆ హీరో మరెవరో కాదు.. సుహాస్.
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా యూట్యూబ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ నటించిన పడి పడి లేచే మనసు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత నాగచైతన్య నటించిన మజిలీ చిత్రంలోనూ హీరో ఫ్రెండ్ పాత్రలో నటించాడు. కట్ చేస్తే.. ఇప్పుడు స్టార్ స్టేటస్ అందుకుని వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు సుహాస్. ఈ సినిమా ఉత్తమ తెలుగు సినిమాగ జాతీయ అవార్డ్ అందుకుంది.
ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో అలరిస్తున్న సుహాస్.. ఇప్పుడు చైతూ కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇప్పటివరకు చైతన్య 24 సినిమాల్లో నటించగా.. సుహాస్ 22 చిత్రాలు చేశాడు. మరికొన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. అలాగే అటు సోషల్ మీడియాలోనూ సందడి చేస్తుంటాడు సుహాస్.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..