
జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 27 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను సినీతారలు ఖండిస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించిన పర్యాటకుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలుపుతున్నరాు. ఈ క్రమంలో బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఓ హీరోయిన్ తన బాల్యంలో జరిగిన విషాదాన్ని గుర్తుచేసింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నిమ్రత్ కౌర్. ఆమె తండ్రి సైతం కశ్మీర్ లో జరిగిన ఇలాంటి ఒక ఉగ్రవాద దాడిలోనే ప్రాణాలు కోల్పోయారు. నిమ్రత్ కౌర్ ది లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్, దాసవి వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆర్మీ కుటుంబం నుంచి సినీరంగంలోకి అడుగుపెట్టిన నిమ్రత్ తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంది. రాజస్థాన్లోని పిలానీలో సిక్కు కుటుంబంలో జన్మించిన నిమ్రత్ ఆమె తండ్రి మేజర్ భూపిందర్ సింగ్. కశ్మీరీ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురయ్యారు. అప్పటికీ నిమ్రత్ వయసు 11 సంవత్సరాలు మాత్రమే.
నిమ్రత్ చిన్న వయసులో ఉన్నప్పుడు 1994 జనవరిలో ఆమె కుటుంబం తన తండ్రిని కలిసేందుకు అలాగే కశ్మీర్ అందాలను చూసేందుకు వచ్చింది. అప్పుడు ఆమె తండ్రిని ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసింది. తమ డిమాండ్స్ నెరవేర్చేవరకు అతడిని వదిలిపెట్టమని తెలిపింది. కానీ మేజర్ భూపిందర్ సింగ్ ఉగ్రవాదుల డిమాండ్స్ అంగీకరించలేదు. దాదాపు ఏడు రోజులు తన తండ్రిని బంధించి హత్య చేసిందని.. ఆ సమయంలో తన తండ్రి వయసు కేవలం 44 సంవత్సరాలు మాత్రమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తన తండ్రి మృతదేహాన్ని మొదటిసారి ఢిల్లీలో మాత్రమే చూశానని తెలిపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తన తండ్రి పెన్షన్ డబ్బుతోపాటు అప్పటికే పొదుపు చేసిన నగదుతో నోయిడాలో సొంతంగా ఇళ్లు కొనుక్కొని అక్కడే నివసించామని తెలిపింది.
మరణం తర్వాత నిమ్రత్ కౌర్ తండ్రి శౌర్య చక్ర అవార్డు వచ్చింది. 2000లో నిమ్రత్ కౌర్ తన సినీప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. 2004లో మ్యూజిక్ వీడియోస్ చేసింది. 2012లో వాసన్ బాలా దర్శకత్వం వహించిన పెడ్లర్స్తో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..