
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న డ్రాగన్ సినిమా నెక్ట్స్ షెడ్యూల్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఏప్రిల్ 22 నుంచి ఎన్టీఆర్ షూట్లో జాయిన్ అవుతున్నారు. ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు రెడీ అవుతోంది మూవీ టీమ్. ఏకంగా 30 రోజుల పాటు ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు మేకర్స్.
రెట్రో సినిమా రిలీజ్‌కు ముందు అభిమానులతో కలిసి ముచ్చటించారు హీరో సూర్య. చెన్నైలోని ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో 70 ప్రాంతాల నుంచి వచ్చిన నాలుగు వేల మంది అభిమానులను సూర్య కలిశారు. వారితో ఫోటోలు దిగారు. ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. కార్తీక్ సబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన రెట్రో మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. పూజా హెగ్డే హీరోయిన్.
త్వరలో అనిల్ రావిపూడి మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే మూడో వారం నుంచి మొదలుకానుంది. తొలి షెడ్యూల్ నుంచే చిరు షూటింగ్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు.
హరి హర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు దర్శకుడు జ్యోతి కృష్ణ. ఈ సినిమాలో కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను పవన్ కల్యాణ్ స్వయంగా ప్లాన్ చేశారని వెల్లడించారు. 11 వందల మందితో హైదరాబాద్‌లో ఈ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేశామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఫైనల్‌గా సితారే జమీన్ పర్ ప్రమోషన్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు ఆమిర్ ఖాన్. మే 1న ట్రైలర్ లాంచ్‌తో పబ్లిసిటీ స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. 2007లో రిలీజ్ అయిన తారే జమీన్ పర్కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో జెనిలియా కీలక పాత్రలో నటిస్తున్నారు. లాల్ సింగ్ చద్దా లాంటి డిజాస్టర్ తరువాత ఆమిర్ చేస్తున్న సినిమా కావటంతో ఈ మూవీ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.