
బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీరంగంలోకి అడుగుపెట్టి.. అందం, అభినయంతో మెప్పించింది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా మారింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పించింది. ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ సైతం అందుకుంది. నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగానూ గుర్తింపు తెచ్చుకుంది. కొన్నాళ్లుగా విమర్శలు, వివాదాలతో నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ కంగనా రనౌత్. ఇండస్ట్రీలో తనకంటూ గొప్ప ఖ్యాతిని సంపాదించుకుంది. ఈరోజు (మార్చి 23)ఆమె పుట్టినరోజు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గానే కాకుండా హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి ఎంపీగా పోటి చేసి గెలిచింది.
ఈరోజు కంగనా రనౌత్ పుట్టినరోజు కావడంతో ఆమెకు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే కంగనా రనౌత్ ఆస్తులు.. పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు 19 ఏళ్లుగా సినిమాల్లో చురుగ్గా ఉంటుంది కంగనా. ఇంతకీ ఆమె ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసా.. ? కంగనా సినిమా రంగంలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు అయింది. 2006 లో విడుదలైన ‘గ్యాంగ్స్టర్’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఇందులో సిమ్రాన్ అనే పాత్రలో అద్భుతమైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత ఫ్యాషన్ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది.
ఇవి కూడా చదవండి
హిందీలో వరుస ఆఫర్స్ అందుకుంటూ తక్కువ మసయంలోనే టాప్ హీరోయిన్ గా మారింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని.. తనను అణచివేస్తున్నారని.. నెపోటిజం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో కంగనాకు నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దాదాపు 19 కెరీర్ లో కంగనా రూ.91 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు సమాచారం. 2022-23లో అతను కేవలం రూ.4 కోట్లు మాత్రమే సంపాదించింది. 2021-22లో రూ. 12 కోట్లు, 2020-21లో రూ. 12 కోట్లు, 2019-20లో రూ. 10 కోట్లు సంపాదించింది.
కంగనాకు కార్లంటే పెద్దగా ఆసక్తి లేదు. అందువల్ల ప్రయాణానికి మాత్రమే తన లగ్జరీ కారును ఉపయోగిస్తుంది. కంగనా ఎంపీ కావడం వల్లే సామాన్యులకు చేరువవుతోంది. రాజకీయాల్లో గెలిస్తే సినిమాలకు దూరంగా ఉంటానని చెప్పిన కంగనా.. ఇప్పటికీ కొత్త సినిమా ప్రకటన చేయలేదు. ఇప్పటికీ ఒంటరిగానే ఉంటుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..