
దక్షిణాది చిత్రపరిశ్రమలో ఆమె తోపు హీరోయిన్. దాదాపు రెండు దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో కుర్ర హీరోయిన్లకు గుబులు పుట్టిస్తోంది. 41 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందం.. చేతినిండా సినిమాలతో బిజీగా ఉంటుంది. ఇటీవలే ఓ భారీ బ్లా్క్ బస్టర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరో మూవీతో థియేటర్లలో సందడి చేయబోతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ అమ్మడు.. పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆమె మరెవరో కాదు.. త్రిష. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే త్రిష ప్రేమ, పెళ్లి గురించి రోజుకో న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ఎన్నోసార్లు త్రిష పెళ్లి గురించి వార్తలు రాగా.. తాజాగా మరోసారి వివాహం గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది.
తనకు పెళ్లిపై సదుద్దేశం లేదని తెలిపిందే. ప్రస్తుతం త్రిష థగ్ లైఫ్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా పాల్గొన్న త్రిష.. తాజాగా తనకు పెళ్లి పై ఉన్న అభిప్రాయాన్ని బయటపెట్టింది. మూడుముళ్ల బంధంపై మీ అభిప్రాయం ఏమిటి ? అని అడగ్గా.. త్రిష మాట్లాడుతూ.. “నిజం చెప్పాలంటే నాకు వివాహంపై నమ్మకంలేదు. నాకు పెళ్లి అయినా ఓకే.. కాకపోయినా ఫర్వాలేదు” అంటూ చెప్పుకొచ్చింది. దీంతో త్రిష మాటలు విని కమల్ హాసన్, శింబు షాకయ్యారు.
ఇటీవల త్రిష కోలీవుడ్ విజయ్ దళపతితో కలిసి గోట్ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రాగా.. వాటిని ఖండించింది త్రిష. అలాగే ఇటీవల తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటే తనవద్ద సమాధానం లేదని.. పెళ్లి ఎప్పుడూ చేసుకుంటానో తనకు కూడా తెలియదని అన్నారు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని.. జీవితాంతం తోడు ఉంటాడనే నమ్మకం కలిగిన వ్యక్తినే చేసుకుంటానని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..