
బాలీవుడ్లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో ఆమె ఒకరు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనను తాను నిరూపించుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల ఆమె ఒక ఫ్యాషన్ ఈవెంట్లో షోస్టాపర్‌గా నిలిచింది. అయితే ఆ షోలో వేదికపై ఆమె చేసిన పనిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నటి తీరుపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. సెలబ్రెటీ అన్న అహంకారం కదా నీకు అంటూ ఆమెను భారీగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. .తనే బాలీవుడ్ బ్యూటీ నుస్రత్ బారుచా. ప్రస్తుతం ఈ బ్యూటీకి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది.
ఇటీవల ఓ ఫ్యాషన్ షోకు నుస్రత్ షో స్టాపర్ గా వేదికపైకి వచ్చింది. అదే సమయంలో అక్కడే స్టేజ్ పై నిల్చున్న అమ్మాయిలలో ఒక అమ్మాయిని పక్కకు నెట్టి నుస్రత్ ముందుకు వస్తుంది. అనంతరం మరో ఇద్దరు అమ్మాయిలను తన పక్కకు పిలిచి ఫోటోలకు ఫోజులిచ్చింది. అయితే సదరు అమ్మాయితో నుస్రత్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నుస్రత్ నటి కాబట్టి ఆమె వైఖరిని ప్రదర్శిస్తోందని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు మాత్రం నుస్రత్ బరుచాకు మద్దతు తెలుపుతున్నారు. ఆమె ఒక షోస్టాపర్, ఆమె ఇంకా ఏమి చేయగలదు అని సపోర్ట్ చేస్తున్నారు. ఈ వీడియోపై ప్రజలు భారీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో కారణంగా చాలా మంది నటిని అహంకారి అని పిలుస్తున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..