

పై ఫొటోలో డాక్టర్ కోటు వేసుకుని పోజులిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? ఈమె ఇప్పుడు బాగా ఫేమస్. ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు ఇప్పటికే గుర్తు పట్టేసి ఉంటారు. గతంలో టిక్ టాక్ తో సహా విధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ బ్యూటీ తరచూ కనిపించేంది. తన డ్యాన్స్ వీడియోలతో నెటిజన్లను ఇట్టే ఆకట్టుకునేంది. ఒక్క టిక్ టాక్ లోనే కాదు ఇన్ స్టా గ్రామ్, యూట్యూబ్ లోనూ ఈ ముద్దుగుమ్మ డ్యాన్స్ వీడియోలే కనిపించేవి. ఈ ట్యాలెంటే ఆమెకు ఇప్పుడు సినిమా అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడీ అందాల తార సిల్వర్ స్క్రీన్ పై కనిపించనుంది. అది కూడా ఓ తెలుగు సినిమాలో. డ్యాన్స్ నేపథ్యంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఢీ ఫేమ్, స్టార్ కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్ హీరోగా నటిస్తున్నాడు. . ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ లో హర్షిత్, హన్షిత ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పూర్తయ్యింది. ఈ డాక్టరమ్మ కూడా షూటింగ్ లో పాల్గొంటోంది. తను ఎవరో ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆమె టీమిండియా క్రికెటర్ మాజీ భార్య ధనశ్రీ వర్మ.
2020లో చాహల్‌ను పెళ్లి చేసుకున్న ధనశ్రీ వర్మ ఐదేళ్లకే తన వివాహా బంధానికి వీడ్కోలు పలికింది. ఇప్పుడు మళ్లీ తన ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది. కాగా లెజెండరీ కొరియోగ్రాఫర్ షియామాక్ దావర్ వద్ద డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. ఆ తర్వాత తానే సొంతంగా డ్యాన్స్ అకాడమీని స్థాపించింది. ఇప్పుడు తన డ్యాన్స్ ట్యాలెంట్ తో సినిమాల్లోకి అడుగు పెట్టింది.
ధనశ్రీ వర్మ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
శశి కుమార్ ముతులూరి దర్శకత్వం వహిస్తున్న ఓ డ్యాన్స్ బేస్డ్ సినిమాలో ధన శ్రీ వర్మ ఓ కీలక పాత్రలో నటించనుంది. ఈ సినిమాలో మలయాళ నటి కార్తీక మురళీధరన్ మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో ధనశ్రీ వర్మ కనిపించింది. యష్ మాస్టర్ తో కలిసి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.
సినిమా షూటింగ్ లో ధన శ్రీ వర్మ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.