సినీ పరిశ్రమలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. కానీ తక్కువ సమయంలోనే విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు తక్కువే. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్.. సినిమాల్లో చాలా పాపులర్. ఇప్పుడు ఆమె వయసు 43 సంవత్సరాలు. ఇప్పటికీ ప్రేమ, పెళ్లికి దూరంగా ఒంటరిగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. నాగార్జున, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. తనే హీరోయిన్ అనుష్క శెట్టి. 5 అడుగుల 10 అంగుళాల పొడవు, ఆకర్షణీయమైన అందం, పొడవాటి జుట్టు, అందమైన స్వభావం కారణంగా ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
అనుష్క 1981 నవంబర్ 7న కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. బెంగళూరులోని మౌంట్ కార్మెల్ కళాశాల నుండి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. అంతేకాదు ఆమె యోగా టీచర్. అనుష్క శెట్టి 2005లో ‘సూపర్’ సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ప్రభాస్ హీరోగా, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. ఇందులో యువరాణి దేవసేన పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
అనుష్క శెట్టి ఒక సినిమాకు దాదాపు రూ.4-5 కోట్లు వసూలు చేస్తుంది. నివేదికల ప్రకారం, అనుష్క శెట్టి మొత్తం సంపద రూ.110 నుండి 120 కోట్లకు పైగా ఉంది. ఆమె దగ్గర లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉటుంది.
ఎక్కువ మంది చదివినవి: Trending Song : 25 ఏళ్లుగా యూట్యూబ్‌ను ఊపేస్తున్న సాంగ్.. 90’s యూత్‌కు ఇష్టమైన పాట.. ఇప్పటికీ ట్రెండింగ్..
Anushka Shetty Throwback
ఎక్కువ మంది చదివినవి: Jagapathi Babu : వెయ్యి కోట్లు పోగొట్టుకున్నాను.. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఆస్తి ఇంతే.. జగపతి బాబు కామెంట్స్..
