
పై ఫొటోలో క్యూట్ స్టిల్స్ తో కవ్విస్తోన్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ను గుర్తు పట్టారా? ఈ ముద్దుగుమ్మ ఎంట్రీనే ఒక సంచలనం. హీరోయిన్ గా నటించిన మొదటి సినిమాతోనే రూ. 250 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక రెండో సినిమాకు అయితే ఏకంగా రూ. 1250 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ సినిమాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని వంటి క్రేజీ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఇక సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే హీరోయిన్లలో ఈ బ్యూటీ కూడా ఒకరు. తను షేర్ చేసే గ్లామరస్ ఫొటోస్, వీడియోలకు నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అలా తాజాగా ఈ అందాల తార కొన్ని క్యూట్ ఫొటోస్ షేర్ చేసింది. సినిమా సెట్ లో డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసింది. అయితే అందులో తన ఫేస్ క్లియర్ గా కనిపించకుండా డబ్బింగ్ మైక్ ను అడ్డు పెట్టుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతన్నాయి. మరి ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే ఆన్సర్ మేమే చెబుతాం లెండి. ఈ క్యూటీ మరెవరో కాదు కేజీఎఫ్ తో బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి.
కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల తర్వాత కోబ్రా సినిమాలో నటించింది శ్రీనిధి శెట్టి. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా 2022లో రిలీజైంది. అయితే ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో శ్రీనిధి శెట్టి బాగా వెనకపడిపోయింది. కోబ్రా సినిమా తర్వాత ఇప్పటివరకు వెండితెరపై కనిపించలేదు శ్రీనిధి శెట్టి. అయితే ఇప్పుడిప్పుడే ఈ బ్యూటీకి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తోన్న హిట్ 3 సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందీ అందాల తార. ఇందులో ఫస్ట్ టైం తను తెలుగులో డబ్బింగ్ చెబుతోంది. తాజాగా తాను డబ్బింగ్ చెబుతున్న క్యూట్ ఫొటోలను కూడా ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేసిందీ అందాల తార. దీంతో ఈ ఫొటోస్ కాస్తా నెట్టింట వైరల్గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు
ఇవి కూడా చదవండి
మహా శివరాత్రి వేడుకల్లో శ్రీనిధి శెట్టి..
హిట్ 3తో పాటు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డసరసన ‘తెలుసు కదా’ మూవీలో నటిస్తోంది శ్రీనిధి. దీంతో పాటు కిచ్చా సుదీప్ సినిమాలోనూ కథానాయికగా యాక్ట్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.