
హిందీలోని అగ్ర సినీతారలలో ఆమె ఒకరు. అతి తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఒకప్పుడు రూ.5వేల జీతం కోసం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా వర్క్ చేసిందట. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ దియా మీర్జా. 2001 లో వచ్చిన రెహ్నా హై తేర్రే దిల్ మే సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. కానీ ఆ సినిమాతోనే పాపులర్ అయ్యింది దియా. సినిమాల్లోకి రాకముందు ఆమె 2000 లో మిస్ ఆసియా పసిఫిక్ ఇంటర్నేషనల్ టైటిల్ ను కూడా గెలుచుకుంది. ఆ తర్వాత మాధవన్, షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, నాగార్జున వంటి స్టార్ హీరలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.
ఇటీవల జూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దియా మీర్జా మాట్లాడుతూ.. 19 ఏళ్ల వయసులో ఐశ్వర్య రాయ్‌తో పోల్చడం తనకు చాలా బాధ కలిగించిందని, కానీ అది తనపై చాలా ఒత్తిడిని పెంచిందని అన్నారు. నటిగా కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లల్లో తనను ఇతర హీరోయిన్లతో పోల్చడం ప్రశంసగా అనిపించిందని అన్నారు. అంతర్జాతీయ అందాల టైటిల్ గెలుచుకున్నప్పటికీ తన గురించి తాను ఎప్పుడూ సంతోషంగా లేనట్లు చెప్పుకొచ్చింది. ఆమె చివరిసారిగా 2024లో ఇబ్రహీం అలీ ఖాన్ తొలి చిత్రం నదానియన్, వెబ్ సిరీస్ IC 814: ది కాందహార్ హైజాక్‌లో కనిపించింది.
దియాకు 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆమె తల్లి హైదరాబాద్‌కు చెందిన అహ్మద్ మీర్జా అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. తరువాత దియా మీర్జా తన సవతి తండ్రి ఇంటిపేరుగా మార్చుకుంది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టడానికి ముందు దియా మీర్జా ఒక మీడియా సంస్థలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిందట. అప్పుడు ఆమెకు రూ.5000 జీతం ఇచ్చారని గతంలో అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చింది. దియా మీర్జా వ్యాపారవేత్త వైభవ్ రేఖీని వివాహం చేసుకుంది. జూలై 2021లో వీరికి బాబు జన్మించాడు.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..