
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసిన గిబ్లి ఆర్ట్ పేరే వినిపిస్తుంది. నెట్టింట ఈ గిబ్లి ఆర్ట్ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. మాములు ఫోటోలను ఈ గిబ్లి ఆర్ట్ యానిమేషన్ పిక్స్ గా మార్చడంతో జనాలు తెగ అట్రాక్ట్ అవుతున్నారు. దీంతో తమ వ్యక్తిగత ఫోటోలను చాట్ జీపిటీలో షేర్ చేస్తూ గిబ్లి ఆర్ట్ గా మార్చేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ గిబ్లి స్టైల్ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తెగ మురిసిపోతున్నారు. కీర్తి సురేష్, నిధి అగర్వాల్, మేఘ ఆకాష్ వంటి స్టార్ హీరోయిన్స్ సైతం ఈ గిబ్లి ఆర్ట్ ఫోటోస్ నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ సైతం తన ఫోటోలను గిబ్లి సాయంతో యానిమేషన్ పిక్స్ గా మార్చేసింది. పైన ఫోటోను చూశారు కదా.. అటు మోడ్రన్.. ఇటు ట్రెడిషనల్ లుక్ లో మెంటలెక్కిస్తోన్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బిజీ హీరోయిన్లలో ఆమె ఒకరు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది.
ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ఇప్పుడిప్పుడే పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసేందుకు రెడీ అయ్యింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ నభా నటేష్. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్న ఈ గిబ్లి ఆర్ట్ సాయంతో తన ఫోటోలను యానిమేషన్ గా మార్చేసింది. ఆ ఫోటోలలో నభా నటేష్ మరింత క్యూట్ గా కనిపిస్తుంది.ఇదిలా ఉంటే.. ప్రస్తుతం నభా నటేష్ యంగ్ హీరో నిఖిల్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది. ఇందులో సంయుక్త మీనన్ సైతం కథానాయికగా కనిపించనుంది.
అలాగే ప్రస్తుతం డైరెక్టర్ గోపిచంద్ మలినేని, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నభా నటేష్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. మరోవైపు ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రపరిశ్రమలో వరుస ఆఫర్స్ అందుకుంటుంది నభా నటేష్.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..