
సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆమె ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు. అందం, అభినయంతో సినీప్రియులను ఆకట్టుకుంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. అయితే ఈ అమ్మడు తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి తాత, మామ మాజీ ప్రధాన మంత్రులు. అంతేకాదు.. ఆమె భర్త సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేస్తూ రచ్చ చేస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ అదితి రావు హైదరీ.
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ. చిన్న వయసులోనే వివాహం చేసుకుంది.. కానీ ఆరు సంవత్సరాలకే భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నటిగా ప్రశంసలు అందుకుంది. వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. కొన్నాళ్లుగా హీరో సిద్ధార్థ్ తో ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ కుటుంబసభ్యుల సమక్షంలో ఎంతో సింపుల్ గా వివాహం చేసుకుంది.
నిజానికి అదితి రావు హైదరీ రాజుల వంశానికి చెందిన అమ్మాయి. ఆమె తాత (తండ్రి తండ్రి) అక్బర్ హైదరీ. అప్పట్లో హైదరాబాద్ ప్రధాన మంత్రిగా పనిచేశారు. అలాగే మరో తాత రామేశ్వర రావు (తల్లి తండ్రి ) తెలంగాణలోని వనపర్తి సంస్థానాధీశునిగా ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ మాజీ భార్య, దర్శకురాలు కిరణ్ రావు అదితికి దగ్గరి బంధువు. అదితికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత తల్లితో కలిసి ఢిల్లీ వచ్చేసిన అదితి.. అక్కడే పెరిగింది. 2006లో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..