
సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ. హిందీతోపాటు తెలుగులో పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయ్యింది. కానీ నిత్యం పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంది. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
50 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు సైతం గుబులు పుట్టిస్తోంది. తాజాగా వైడ్ అండ్ గోల్డ్ లెహంగాలో ఆమె షేర్ చేసిన ఫోటోస్ కుర్రకారు గుండెల్లో గుబులు పెంచుతున్నాయి. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ మలైకా అరోరా.
తాజాగా మలైకా అరోరా వైట్ అండ్ గోల్డ్ లెహంగాలో మెరిసింది. సురిలీ గోయెల్ లెహంగా.. మలైకా ఫోటోషూట్ బ్యాక్ గ్రౌండ్ పెయింటింగ్ ప్రత్యేక హైలెట్ అయ్యింది. 51 ఏల్ల మలైకాకు సెలబ్రెటీ స్టైలీస్ట్ ఆస్తా శర్మ ఈ లుక్ స్టైలీంగ్ చేశారు.
ఈ ఖరీదైన డిజైనర్ లెహంగా తొమ్మిది అడుగుల పొడువుతో మరింత అందంగా కనిపిస్తుంది. చురిదార్ స్లీవ్స్ ఐవరీ బ్లౌజ్ తో బంగారు రంగు పూల ఎంబ్రాయిడరీ డిజైన్ ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మలైకా అందాలను ప్లంగింగ్ వీ నెక్ లైన్ అద్భుతంగా ఎలివేట్ చేసింది.
ప్రస్తుతం మలైకాకు సంబంధించిన ఈ అందమైన ఫోటోస్ కుర్రాకారును ఆకట్టుకుంటున్నాయి. భర్తతో విడాకుల తర్వాత కొన్నేళ్లపాటు బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసింది మలైకా. వీరిద్దరి మధ్య ఇటీవల బ్రేకప్ అయినట్లు తెలుస్తోంది.