
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. రిజల్ట్ తో సంబంధం లేకుండా ఆయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పవన్ సినిమా విడుదలయ్యిందంటే చాలు థియేటర్లలో జాతరే. పాన్ ఇండియా సినిమా చేయకపోయినా తనకంటూ బీభత్సమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. పవన్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. పవన్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు తన నెక్ట్స్ మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేయడానికి పవన్ ప్రయత్నిస్తున్నారట. త్వరలోనే తన నెక్ట్స్ మూవీ షూటింగ్స్ కంప్లీట్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. పవన్ నటించిన చిత్రాల్లో పంజా ఒకటి. 2011లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రివ్యూస్ వచ్చాయి. ఈ చిత్రంలో పవన్ తన యాక్టింగ్, లుక్స్ ప్రేక్షకులను ఫిదా చేశాయి.
ఇక ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం మరింత హైలెట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే ఇందులో నటించిన హీరోయిన్స్ గుర్తున్నారా.. ? అందులో పవన్ జోడిగా కనిపించిన అమ్మాయి పేరు సారా జేన్ డయాస్. పంజా సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. అప్పట్లో సారా జేన్ కాస్త బొద్దుగా ఎంతో అందంగా కనిపించింది. కానీ పంజా మూవీ తర్వాత ఈ బ్యూటీ తెలుగులో మరో సినిమా చేయలేదు. చాలా కాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సారా జేన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది.
నిత్యం నెట్టింట క్రేజీ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తూ ఫాలోవర్లను ఆకట్టుకుంటుంది. తాజాగా సారా జేన్ లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అప్పట్లో ఎంతో ముద్దుగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడు పూర్తిగా బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోస్ వైరలవుతున్నాయి.

Sarah Jane Dias
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..