
ప్రస్తుతం బుల్లితెరపై ఆమె ఫైర్ బ్రాండ్. ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ బ్యూటీగా ఎదిగింది. అంతేకాదు.. భాషతో సంబంధం లేకుండా ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ఓ నటుడిని పిచ్చిగా ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ మరో నటితో ఎఫైర్ పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చెంప చెల్లుమనిపించింది. ఆ తర్వాత అతడితో విడాకులు తీసుకుని కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ప్రస్తుతం వరుస సీరియల్స్, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. తనే జెన్నిఫర్ వింగెట్. ప్రముఖ నటుడు కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి దిల్ మిల్ గయే సిరీస్ చేసింది. అదే సమయంలో వీరిద్దరు ప్రేమలో పడ్డారు. 2012 లో వివాహం చేసుకున్నారు. కానీ కొన్నాళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2014లో విడాకులు తీసుకున్నారు.
విడాకుల తర్వాత జెన్నిఫర్ జీవితంపై అనేక ఒత్తిడి ఏర్పడింది. ఎక్కడికి వెళ్లకూడదని.. ఏమి చేయకూడదని ఎంతో మంది చాలా మాటలు అన్నారని.. తన నిర్ణయాలను అనేక మంది ప్రశ్నించారని.. కానీ మాటలు వినకుండా తిరిగి నటిగా కెరీర్ ప్రారంభించినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు జెన్నిఫర్ వింగెట్ టెలివిజన్లో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు. ఆమె ప్రేమ కోసం తన కెరీర్ను వదులుకోవడానికి సిద్ధంగా ఉండటం ఆమె అభిమానులకు ఆశ్చర్యం కలిగించింది.
జెన్నిఫర్ వింగెట్ తొలిసారిగా ఆమిర్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన 1995 చిత్రం అకేలే హమ్ అకేలే తుమ్ లో కనిపించింది. ఆ తర్వాత ఐశ్వర్య రాయ్ నటించిన కుచ్ నా కహో సినిమాలోనూ మెరిసింది. బుల్లితరెపై కసౌతి జిందగీ కి, సరస్వతిచంద్ర, బెహద్ వంటి షోలతో పాపులర్ అయ్యింది. జెన్నిఫర్ వింగెట్ తో విడాకుల తర్వాత ఆమె భర్త 2016 లో బిపాషా బసును వివాహం చేసుకున్నాడు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..