
సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా యావరేజ్‌గా నిలిచింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేకపోయింది. కానీ ఈ బ్యూటీకి మాత్రం సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలతోనే ఈ అమ్మడు తెగ వార్తలలో నిలిచింది. హిందీలో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. తెలుగులో మాత్రం ఒక్క సినిమానే చేసింది. తీరా ఆ మూవీ సైతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. కట్ చేస్తే ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరంటే.. బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే.
కొన్నాళ్లుగా ఈ హీరోయిన్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతుంది. స్టార్ హోరలతో ప్రేమాయణం.. క్రికెటర్ తో డేటింగ్ అంటూ అనేక రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. అయితే తన గురించి వస్తున్న రూమర్స్ పై ఇప్పటికీ ఆమె నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. అనన్య పాండే.. హిందీలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కానీ ఆ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా క్రేజ్ రాలేదు. చివరకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ జోడిగా లైగర్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీతోనే తెలుగు తెరకు పరిచయమైంది అనన్య.
ఇవి కూడా చదవండి
అనన్య నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ కావడంతో ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఇప్పుడు ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన గ్లామర్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..