
తెలుగులో ఇప్పుడిప్పుడే మరింత పాపులర్ అవుతుంది ఈ వయ్యారి. హారర్ నేపథ్యంలో వచ్చిన సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయిగా కనిపించి ప్రేక్షకులను భయపెట్టించిన ఈ వయ్యారి.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ స్టన్నింగ్ ఫోజులతో మెంటలెక్కిస్తోంది. నిత్యం ఇన్ స్టాలో వరుస ఫోటోషూట్స్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? తనే బాంధవి శ్రీధర్. ఈ పేరు చెబితే ఠక్కున గుర్తుపట్టలేరు. కానీ మసూద సినిమా హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. 2022లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.
స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ఇందులో తిరువీర్, కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సీనియర్ హీరోయిన్ సంగీత కీలకపాత్రలు పోషఇంచారు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందించారు. ఇందులో సంగీత కూతురిగా కనిపించి దెయ్యం పట్టిన యువతిగా కనిపించింది బాంధవి శ్రీధర్.
ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. అంతకు ముందు ఆమె 2019 మిస్ ఇండియా రన్నరప్. అలాగే 2019 మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్. మిస్ ఇండియా మిస్ ఆంధ్రప్రదేశ్ 2019గా నిలిచంది. మసూద సినిమాతోపాటు మళ్లీరావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి చిత్రాల్లో నటించింది. బాంధవి శ్రీధర్ రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..