
చాలామంది హీరోయిన్లలాగే ఈ ముద్దుగుమ్మ కూడా మోడలింగ్ ను కెరీర్ గా ఎంచుకుంది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. ముఖ్యంగా క్యాడ్బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఈ ముద్దుగుమ్మ బాగా ఫేమస్ అయిపోయింది. దీంతో ఈ అమ్మడికి బాలీవుడ్ లో అవకాశం వచ్చింది. మొదటి సినిమాలోనే తన అందం, అభినయంతో యువతను ఆకట్టుకుంది. హిందీలో వరుసగా రెండు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ ఒక స్టార్ హీరో సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. డైరెక్టర్ కూడా మంచి సక్సెస్ రేట్ ఉన్నవాడే. కానీ తన తెలుగు డెబ్యూ మూవీ అనూహ్యంగా బోల్తా పడింది. ఈ అమ్మడి అందం, అభినయానికి మంచి పేరొచ్చినా సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీంతో తెలుగులో ఈ అందాల తార పని అయిపోయినట్టేనని చాలా మంది భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ టాలీవుడ్ లో జెట్ స్పీడ్ లో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో 5 క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇలా టాలీవుడ్ లో బ్రేకుల్లేని బండిలా దూసుకుపోతోన్న ఆ ముద్దుగుమ్మ మరెవరో కాదు మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ భోర్సే.
ఇవి కూడా చదవండి
విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న ‘కింగ్ డమ్’లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందన్నాని అనుకున్నారు. అయితే చివరకు ఆ ఆఫర్ భాగ్యశ్రీని వరించింది. ఇక ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో
మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) తెరకె్క్కిస్తోన్న సినిమాలోనూ భాగ్యశ్రీనే హీరోయిన్. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న ‘కాంతా’ లోనూ భాగ్యశ్రీనే కథానాయికగా ఎంపికైందని సమాచారం. అలాగే సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందే సినిమాలోనూ ఈ క్రేజీ హీరోయిన్ ని లాక్ చేశారని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందీ ముద్దుగుమ్మ. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న బ్రహ్మా రాక్షస్ లోనూ ఈ ముద్దుగుమ్మ నటించనుందని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి 5 పాన్ ఇండియా సినిమాలతో బిజి బిజీగా ఉంటోందీ అమ్మడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి