

ఈ హీరోయిన్ తన ఐదేళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. కథాకళి, భరత నాట్యం, మోహినీ అట్టం, కూచిపుడి తదితర శాస్త్రీయ నృత్యాల్లో నైపుణ్యం సంపాదించింది. ఇంతేనా.. మార్షల్ ఆర్ట్స్ లోనూ ప్రావీణ్యం సాధించింది. కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్ అయిన ఆమె కేరళ ఫేమస కలరిపయట్టు లోనూ నైపుణ్యం సాధించింది. అలాగనీ చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. గతేడాది ఇంటర్మీడియెట్ ను పూర్తి చేసింది. ప్రస్తుతం ఉన్నత చదువుల కోసం రెడీ అవుతోంది. అదే సమయంలో వరుస సినిమాలతోనూ అలరిస్తోంది. ఇప్పటివరకు తెలుగులో ఈ ముద్దుగుమ్మ నటించింది ఒకే ఒక్క సినిమాలో. అయితేనేం తెలుగు ఆడియెన్స్ కు ఫేవరెట్ గా మారిపోయింది. ఇప్పుడు ఇదే సినిమా సీక్వెల్ తో మరోసారి మన ముందుకు వస్తోంది. చూడ్డానికి చాలా బక్కగా, సన్నగా, నాజుకుగా కనిపించినా ఎంతో క్యూట్ గా ఉండే ఆ హీరోయిన్ మరెవరో కాదు మ్యాడ్ మూవీ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్. త్వరలోనే మ్యాడ్ స్క్వేర్ 2 సినిమా రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో చాలామందికి చాలా విషయాలు తెలియదు.
కేరళలోని త్రిస్సూర్ ప్రాంతానికి చెందిన అనంతిక ది మ్యాడ్ మొదటి సినిమా అనుకుంటారు చాలామంది. కానీ అంతకు ముందే ఆమె 2022లో రాజమండ్రి రోజ్ మిల్క్ అనే తెలుగు సినిమాలో నటించింది. ఇందులో కీర్తి అనే కాలేజీ అమ్మాయి పాత్రలో కనిపించింద అనంతిక. ఆ తర్వాత 2023లో మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే రజనీకాంత్ లాల్ సలాంలోనూ ఓ కీలక పాత్ర పోషించింది. అలాగే రైడ్ అనే తమిళ సినిమాలోనూ తళుక్కుమంది
అనంతిక లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
. ఇప్పుడు త్వరలోనే మ్యాడ్ స్క్వేర్ 2 సినిమాతో మరోసారి మనల్ని అలరించేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు 8 వసంతాలు అనే మూవీలోనూ హీరోయిన్ గా నటిస్తోంది అనంతిక.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.