
తెలుగులో వరుస సినిమాలతో అలరిస్తుంది ఈ వయ్యారి. అందం, అభినయంతోపాటు ఇటు గ్లామర్ లిమిట్స్ సైతం క్రాస్ చేస్తోంది. దాదాపు ఏడేళ్లుగా సినీరంగంలో యాక్టివ్ గా ఉంది. ఇప్పటికీ ఈ బ్యూటీకి సరైన బ్రేక్ రాలేదు. ఇంతకీ ఈ ముందుకు ఎవరో తెలుసా.. ?
సోషల్ మీడియాలో ఆమె ఫోటోషూట్ షేర్ చేసిందంటే చాలు.. నెటిజన్స్ ఫిదా అయిపోతుంటారు. ట్రెడిషనల్ అయినా.. వెస్ట్రర్న్ అయినా ఈ అమ్మాడి కట్టిపడేస్తుంది. అద్భుతమైన నటనతో తన పాత్రకు పూర్తిస్తాయిలో న్యాయం చేస్తుంది.
ఆమె మరెవరో కాదు.. రుహానీ శర్మ. ఏడేళ్ల క్రితం చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీలో ముద్దుగుమ్మ యాక్టింగ్ చూసి అడియన్స్ ఫిదా అయ్యారు. స్ట్రాంగ్ ఉమెన్ రోల్ లో రుహానీ ఆకట్టుకుంది.
ఆ తర్వాత తెలుగులో మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆ సినిమాలన్నీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. నటిగా మంచి మార్కులు కొట్టేసినప్పటికీ ఈ బ్యూటీకి అవకాశాలు రాలేదు. గతేడాది విక్టరీ వెంకటేశ్ జోడిగా సైంధవ్ చిత్రంలో నటించింది.
తెలుగులో శ్రీరంగనీతులు, ఆపరేషన్ వాలెంటైన్, లవ్ మీ సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషలలోనూ పలు సినిమాల్లో నటించింది. అవకాశాలు రాకపోయినా.. ఈ బ్యూటీకి ఇన్ స్టాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.