
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే చర్మ సమస్యలతో ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆ ముద్దుగుమ్మ తనకున్న చర్మ సమస్య గురించి చెబుతూ.. ఆ కారణంగానే సినిమాల నుంచి తప్పుకున్నట్లు వెల్లడించింది. అలాగే తన కనుబొమ్మలు, కనురెప్పలు సైతం తెల్లగా మారడాన్ని గమనించానని చెప్పుకొచ్చింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ఆండ్రియా జెరెమియా. తెలుగుతోపాటు తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ తో ప్రేమాయణం, బ్రేకప్ కారణంగా నిత్యం వార్తలలో నిలిచింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆండ్రియా మాట్లాడుతూ.. “నేను నిద్ర లేచినప్పుడల్లా నా కనుబొమ్మలు, కనురెప్పలు తెల్లగా మారడం గమనించాను. నా శరీరంపై రోజూ కొత్త మచ్చలు కనిపించాయి. నా రక్త పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయి. కానీ చర్మం పై ఆ సమస్యలు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదు. ఇది తెలియని విషం లేదా భావోద్వేగ ఒత్తిడి వల్ల కావచ్చునని వైద్యులు నాకు చెప్పారు” అని ఆండ్రియా జెరెమియా అన్నారు.
‘ వడ చెన్నై’ సినిమా తర్వాత తన చర్మ సమస్య బయటపడిందని.. దీంతో సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. “నేను ప్రేమలో మోసపోయానని.. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యానని రూమర్స్ సృష్టించారు. కానీ నా ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాను. కొన్నాళ్లకు రీఎంట్రీ ఇచ్చాను. సమస్యలను ఎదుర్కోవడానికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది” అని అన్నారు. ఆక్యుపంక్చర్ తనకు పనిచేసిందని చెప్పుకొచ్చింది. జీవనశైలిలో మార్పులు చేసుకోవడం కారణంగా సమస్యలు తగ్గాయని.. జీవనశైలిలో మార్పు, పని తగ్గించడం.. తన పెంపుడు కుక్కతో ప్రశాంతమైన జీవితం గడిపానని. ‘మాస్టర్’ , ‘పిసాసు’ వంటి సినిమాలు చేసినప్పుడు, ఎవరికీ దాని గురించి తెలియదు అని తెలిపింది. ప్రస్తుతం మాస్క్ సినిమాలో రుహాని శర్మతో కలిసి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..