
సినీరంగుల ప్రపంచంలో ఇలాంటి నటులు చాలా మంది ఉన్నారు. సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్లో తనదైన ముద్ర వేసిన వ్యక్తుల గురించి చెప్పక్కర్లేదు. అలాంటి వారిలో ఈ హీరో ఒకరు. తన కుటుంబాన్ని పోషించడానికి కళాశాలలో చదువుతున్నప్పుడే పని చేయడం స్టార్ట్ చేశాడు. కట్ చేస్తే ఇప్పుడు కోట్లకు యజమాని అయ్యారు. అతడు మరెవరో కాదండి.. ఇప్పుడు బీటౌన్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న యంగ్ హీరో విక్రాంత్ మాస్సే.. హసీన్ దిల్రుబా, 12th ఫెయిల్, సెక్టార్ 36 వంటి హిట్ చిత్రాల్లో నటించాడు విక్రాంత్ మాస్సే. అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. విక్రాంత్ కేవలం 16 సంవత్సరాల వయస్సులో స్వయంగా డ్యాన్స్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ గా మారి పలువురికి డ్యాన్స్ నేర్పించాడు. విక్రాంత్ తన కుటుంబాన్ని పోషించడానికి ఒక కాఫీ షాపులో కూడా పనిచేశాడు. కానీ ఆ తర్వాత నటుడు కావాలని కలలు కన్న విక్రాంత్ టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఎన్నో సంఘర్షణల తర్వాత బాలిక వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్లో అవకాశం వచ్చింది. ఇందులో శ్యామ్ పాత్రతో మరింత పాపులర్ అయ్యాడు.
ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన విక్రాంత్ నెమ్మదిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రారంభంలో అతను చాలా చిత్రాలలో సైడ్ రోల్స్ పోషించాడు. కానీ ఇప్పుడు అతడు స్టార్ హీరో. విక్రాంత్ తన నటన ఆధారంగా కోట్ల విలువైన ఆస్తికి యజమాని అయ్యాడు. వేదికల ప్రకారం, అతని నికర విలువ దాదాపు రూ.26 కోట్లు. ప్రస్తుతం తన భార్య కొడుకుతో కలిసి ముంబైలోని ఒక విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నాడు.
విక్రాంత్ సినిమాల విషయానికి వస్తే… అతడు చివరిసారిగా ‘ది సబర్మతి రిపోర్ట్’ చిత్రంలో కనిపించాడు. ఇందులో విక్రాంత్ సరసన టాలీవుడ్ హీరోయిన్ రాశి ఖన్నా నటించింది. ఈ మూవీ తర్వాత విక్రాంత్ ఇప్పుడు హిందీలో మరిన్ని ఆఫర్స్ అందుకుంటున్నాడు.
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..
Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..
Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..
Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..