
సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్. ఓవైపు వరుస సినిమాలతో అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇటు నెట్టంట కూడా సందడి చేస్తుంది. తాజాగా చీరకట్టులో ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఇంతకీ ఆ వయ్యారిని గుర్తుపట్టారా.. ?
ఇన్నాళ్లు గ్లామర్ ఫోటోలతో నెట్టింట రచ్చ చేసిన ఈ వయ్యారి.. ఇప్పుడు పద్దతిగా చీరకట్టులో కవ్వించింది. దీంతో ఆమె షేర్ చేసిన ఫోటోస్ క్షణాల్లో వైరలయ్యాయి. అందల ఆరబోతలో అస్సలు తగ్గేదే లే అంటున్న బ్యూటీ మరెవరో కాదు.. నభా నటేశ్.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ అమ్మడు. మొదటి సినిమాతోనే యూత్ మనసులు దోచుకుంది. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ మూవీతో హిట్టు అందుకుంది.
ఈ మూవీతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ అదే సమయంలో ఈ బ్యూటీకి యాక్సిడెంట్ జరిగింది. దీంతో ఒకే చెప్పిన ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది.
కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న నభా.. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ మరోసారి ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పుడు నిఖిల్ సరసన స్వయంభు చిత్రంలో నటిస్తుంది.