

పై ఫొటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా? ఈ పిల్లాడు ఇప్పుడు పెరిగి పెద్దయ్యాడు. టాలీవుడ్ లో క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయవాడలో పుట్టి పెరిగిన అతను సినిమాల్లో నటించాలనే లక్ష్యంతో హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయాడు. కానీ సినిమాల్లో అంత ఈజీగా అవకాశం రాలేదు. చాలా ఏళ్లు కష్టపడితే కానీ నటుడిగా ఛాన్స్ దక్కించుకోలేకపోయాడు. మొదట కొన్ని చిన్న సినిమాల్లో నటించాడు. మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ అదృష్టం పరీక్షించుకుని సక్సెస్ అయ్యాడు. ఎక్కువగా లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీస్ చేస్తూ తెలుగు ఆడియెన్స్ కు చేరువైపోయాడు. అన్నట్లు ఈ హీరోకు సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. తన తల్లిదండ్రులిద్దరినీ కూడా ఇందులో భాగం చేసుకున్నాడు. మరి ఈ తెలుగు హీరోను గుర్తు పట్టారా? కొంచెం కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండి. అతను మరెవరో కాదు నాగ శౌర్య. బుధవారం (జనవరి 22) ఈ హీరో పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ హ్యాండ్సమ్ హీరోకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో నాగ శౌర్యకు చెందిన చిన్న నాటి ఫొటోలు, వీడియోలు, ఆసక్తికర విషయాలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సినిమాల్లోకి రాకముందు టెన్నిస్ క్రీడపై మక్కువ పెంచుకున్నాడు నాగ శౌర్య. స్టేట్ లెవెల్ టోర్నమెంట్లలో కూడా ఆడాడట. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి టెన్నిస్ కి దూరమయ్యానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడీ హ్యాండ్సమ్ హీరో. ఇక సినిమాల విషయానికి వస్తే.. 2023లో రంగభళి సినిమాలో చివరి సారిగా కనిపించాడు నాగ శౌర్య. ప్రస్తుతం పోలీస్ వారి హెచ్చరిక అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటున్నాడు. అలాగే NS 24 (వర్కింగ్ టైటిల్ ) మూవీలోనూ యాక్ట్ చేస్తున్నాడీ హ్యాండ్సమ్ హీరో.
నాగ శౌర్య లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటో..
View this post on Instagram
రంగభళి తర్వాత…
View this post on Instagram
నాగ శౌర్య 2022లో అనుషా శెట్టిని వివాహం చేసుకున్నాడు. బెంగళూరులో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అనుషా శెట్టి ఇంటీరియర్ డిజైనర్.
మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి