
ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. హిందీలో వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఒకప్పుడు పెద్ద స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు సోషల్ మీడియా సెలబ్రెటీ ఓర్రీ వద్ద మేనేజర్ గా పనిచేస్తుంది. బాలీవుడ్ సినిమా ఈవెంట్స్, పార్టీలలో కనిపించి సినీతారలతో వెరైటీగా ఫోటోలకు ఫోజులిచ్చి ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు ఓర్రీ అలియాస్ ఓర్హాన్ అవ్రతమణి. నెట్టింట విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ఓర్రీ.. అతడి మేనేజర్ గా పనిచేస్తోన్న అమ్మాయి ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు కిమ్ శర్మ.
మొహబ్బతే ఫేమ్ కిమ్ శర్మ ఓరి అవతార్మణి అకా ఓరి విజయం వెనుక ఉన్న వ్యక్తి. తెలుగులో ఖడ్గం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. నివేదికల ప్రకారం ఓర్రీ మేనేజర్ గా పనిచేస్తూ కిమ్ శర్మ ఆస్తులు రూ.10 కోట్లకు పైగానే సంపాదించినట్లు సమాచారం. ఇటీవల కృనాల్ సదానంద్ తో పాడ్ కాస్డ్ లో పాల్గొన్న కిమ్ శర్మ తన వ్యక్తి విషయాల గురించి మాట్లాడుతూ.. ఓర్రీ లైఫ్ స్టైల్ గురించి ప్రస్తావించింది. మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన కిమ్ శర్మ..2000లో షారుఖ్ ఖాన్ నటించిన మొహబ్బతే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటించి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. తెలుగు ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ ప్రేయసిగా కనిపించింది.
కొంతకాలం దేశం విడిచి కెన్యాకు వెళ్లిపోయిన కిమ్ శర్మ.. ఆ తర్వాత బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె ధర్మ కార్నర్‌స్టోన్ ఏజెన్సీకి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేస్తుంది. ఈ కంపెనీ ఓర్రీకి సంబంధించినది. ఓర్రీ గురించి కిమ్ శర్మ మాట్లాడుతూ.. ఓర్రీ కేవలం కొత్త తరంలో ఒక భాగం కాదని, ఇప్పటికే ఉన్నత స్థాయికి చేరుకున్న తరంలో ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తి అని తెలిపింది. “అతను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, మేము ఎప్పుడూ అలా అనము. అతను ఒక సెలబ్రిటీ. అతను చాలా పరిమితులు , సరిహద్దులు లేని వ్యక్తి. అతను గొప్ప ప్రభావం చూపే వ్యక్తి” అంటూ చెప్పుకొచ్చింది.
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..