
ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఆమె కెరీర్ ప్రయాణం ఏమాత్రం సులువుగా జరగలేదు. నటనలోకి అడుగుపెట్టే ముందు ఆమెకు భిన్నమైన ఆకాంక్షలు ఉండేవి. మిస్ వరల్డ్ కిరీటాన్ని పొంది స్టార్ కావడానికి ముందు ఆమె ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలని కలలు కన్నారు. కానీ ఆమెను తన సోదరుడు మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టేలా చేశారు. మిస్ ఇండియా విజేతగా నిలవడంతో ఆమె జీవితం ఒక్కసారిగా మారిపోయింది. దీంతో నాసాలో చేరాలనే కల అక్కడికే ఆగిపోయింది. కానీ ఇండస్ట్రీలో ఆమె ఎదుగుదల అంత సులభంగా లేదు. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఇప్పుడు గ్లోబల్ బ్యూటీగా మారింది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ ప్రియాంక చోప్రా.
2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తర్వాత ప్రియాంక బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే హిందీ చిత్రపరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటిగా మారింది. స్థిరపడిన తారలు ఆధిపత్యం చెలాయించే పరిశ్రమలో తనను తాను నిరూపించుకోవడానికి, ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి ఆమె చాలా కష్టపడాల్సి వచ్చింది. అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. 2003లో అందాజ్ సినిమాతో తనదైన ముద్ర వేసింది. ఆ తర్వాత డాన్ , డాన్ 2 వంటి చిత్రాల్లో నటించింది. ఫ్యాషన్ సినిమాతో నటిగా ప్రశంసలు అందుకుంది. బర్ఫీ సినిమాలో ఆటిస్టిక్ మహిళగా ప్రియాంక నటించిన తీరు గురించి చెప్పక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో అద్భుతమైన నటనతో కట్టిపడేసింది.
2015 లో ప్రియాంక హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోలో నటించింది. ప్రియాంక హాలీవుడ్‌కు మారడం సవాళ్లను ఎదుర్కొంది. కానీ ఆమె త్వరగానే ప్రపంచవ్యాప్తంగా సినీరంగంలో గుర్తించదగిన నటిగా మారింది. కథానాయికగానే కాకుండా నిర్మాతగా, వ్యాపారవేత్తగానూ రాణించింది. ప్రియాంక అమెరికా సింగర్ నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకుంది. వీరికి మాల్టి మేరీ జోనాస్ అనే పాప ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ రోషన్ క్రిష్ 4 సినిమాతోపాటు రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న ప్రాజెక్టులో నటిస్తుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..