
తెలుగు సినీపరిశ్రమలో ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఫస్ట్ మూవీతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ అంతగా క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు మిస్టరీ థ్రిల్లర్ మూవీతో మరో సక్సెస్ అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో అమ్మడి క్రేజ్ మారిపోయింది. ఒక్కసారిగా తెలుగులో చాలా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. కేవలం 4 నెలల్లోనే వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. రూ.850 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీలో సత్తా చాటింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ హీరోయిన్ ఎవరో కాదు.. మీనాక్షి చౌదరి.
నిజానికి మీనాక్షి చౌదరి డెంటిస్ట్. తండ్రి ఆర్మీ. నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. విజయ్ ఆంటోని నటించిన కొలే సినిమాతో తెరంగేట్రం చేశారు. ఆ తర్వాత తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమయ్యింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. కానీ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కొన్నాళ్లు చిన్న చిన్న సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. ఆతర్వాత హిట్ 2 సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే గుంటూరు కారణం సినిమాలో నటించింది.
ఇవి కూడా చదవండి
తమిళంలో విజయ్ దళపతి సరసన గోట్ చిత్రంతోపాటు.. ఇటీవల దుల్కర్ సల్మాన్ సరసన లక్కీ భాస్కర్ చిత్రాలతో వరుస హిట్స్ ఖాతాలో వేసుకుంది. గోట్ చిత్రం రూ.450 కోట్లు రాబట్టగా.. లక్కీ భాస్కర్ రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ ఏడాది వెంకీ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కనిపించింది. ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. మొత్తం బాక్సాఫీస్ వద్ద రూ.850 కోట్లు రాబట్టింది ఈ వయ్యారి.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..