
తెలుగు చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే క్రేజ్ సొంతం చేసుకుంటున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడు.. సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తుంది. మాస్ మాహరాజా రవితేజ జోడిగా ఈ బ్యూటీ చేసిన సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. నటిగా ఈ అమ్మడు మంచి మార్కులు కొట్టేసినప్పటికీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కానీ తెలుగులో ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే ఈ బ్యూటీ నటించిన సినిమాలన్నీ అంతగా హిట్ కాకపోవడంతో రావాల్సినంత క్రేజ్ రాలేదు. అయితే ఇన్నాళ్లు అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు లాయర్ అని తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అటు లాయర్ గా ఉన్నత చదువులు చదువుతూ ఇటు వరుస ప్రాజెక్టులతో సినీప్రియులను ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మాళవిక శర్మ.
మాళవిక శర్మ.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి. ముంబైకి చెందిన ఈ బ్యూటీ.. అటు లా చదువుతూనే ఇటు నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో పలు వాణిజ్య ప్రకటనలు చేసిన మాళవిక.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. మాస్ మాహరాజా రవితేజ సరసన నేల టికెట్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా హిట్ కాకపోవడంతో ఈ బ్యూటీకి అంతగా పాపులారిటీ రాలేదు. ఆ తర్వాత తెలుగులో రెడ్, కాఫీ విత్ కాదల్ వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాలు కూడా నిరాశపరిచాయి.
ఇవి కూడా చదవండి
మాళవిక శర్మ.. ముంబైలోని రిజ్వి లా కాలేజీలో క్రిమినాలజీ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో లా చేసింది ఈ ముద్దుగుమ్మ. అటు చదువుతునే ఇటు సినిమాల్లో రాణిస్తుంది. తెలుగులో గోపిచంద్ సరసన భీమా, సుధీర్ బాబు జోడిగా హరోంహర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు.. రెగ్యులర్ పోస్టులు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..