
చంద్రముఖి.. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కలెక్షన్ల సునామీ సృష్టించింది. హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్‌కు సరికొత్త థ్రిల్ ఇచ్చింది. 2005లో విడుదల అయిన ఈ చిత్రానికి పీ.వాసు దర్శకత్వం వహించారు. ఇందులో సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు.. జ్యోతిక, నయనతార, ప్రభు, నాజర్, వడివేలు కీ రోల్స్ చేశారు. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాకు ఓ రేంజ్ రేటింగ్ ఉంటుంది. మూవీలో అందరూ అద్భుతంగా నటించారు. సినిమాలో కనిపించిన ఓ పాప గురించి మీకు చెప్పాలి.. ఈ మూవీలోని ‘అత్తింధోం.. ‘ పాటలో రజినీ పక్కన కనిపిస్తుంది. ముద్దులొలికే ఉన్న ఆ పాపపేరు ప్రహర్షిత శ్రీనివాసన్. కోలీవుడ్‌లో తను చాలా ఫేమస్.
బాలనటిగా తమిళంలో అనేక సినిమాలు, సీరియల్స్ చేసింది. కానీ చంద్రముఖి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం. చంద్రముఖి తర్వాత తను సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. చాలా ఏళ్లు నటనకు దూరంగా ఉన్న తను.. బుల్లితెరపై గత ఏడాది ఓ సీరియల్లో కనిపించింది. అలాగే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు షేర్ చేస్తోంది. అప్పట్లో క్యూట్‌గా ఉన్న ఆ చిన్నారి.. ఇప్పుడు మరింత అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇదిలా ఉంటే.. ప్రహర్షితకు పెళ్లి అయినట్లు తెలిసింది. 2021లోనే మ్యారేజ్ చేసుకున్న తను 2022లో ఓ పాపకు జన్మనిచ్చినట్లు చెబుతన్నారు ఇప్పుడు తను ఫ్యామిలీతో దిగిన ఫోటోస్ ఎక్కువ షేర్ చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.