

పై ఫొటోలో ఎన్సీసీ డ్రెస్ లో ఉన్న క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఈ క్యూటీ టాలీవుడ్ లో బాగా ఫేమస్. సినిమాలతో పాటు పలు టీవీ షోల్లోనూ మెరిసింది. ముఖ్యంగా తన చలాకీ మాటలు, పంచులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అందుకే వెండితెరపై కంటే బుల్లితెరపైనే ఈ అమ్మడు బాగా ఫేమస్. ముఖ్యంగా ఓ మేల్ యాంకర్ తో కలిసి ఈ లేడీ యాంకర్ చేసిన టీవీ షోలు సూపర్ హిట్ అయ్యాయి. బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అన్నట్లు ఫేమస్ రియాలిటీ షో బిగ్ బాస్ లోనూ సందడి చేసిందీ అందాల తార. అయితే గతంలో లాగా టీవీ షోస్ లో కనిపించడం లేదీ స్టార్ యాంకర్. మొత్తం తన సమయాన్ని కుటుంబానికే కేటాయిస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటోంది. ఈ బ్యూటీకి ఒక సొంత యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. అందులో తన భర్త, పిల్లలతో కలిసి వీడియోలు చేస్తూ వార్తల్లో ఉంటుందీ అందాల తార. మరి ఈ క్యూటీ ఎవరో గుర్తు పట్టారా? అయితే మీకో క్లూ.. ఏనుగు, చీమ జోకులతో బాగా ఫేమస్ అయ్యిందీ స్టార్ యాంకర్. అలాగే యాంకర్ రవితో కలిసి ఆమె చేసిన టీవీ షోలు, ప్రోగ్రామ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి.యస్.. ఈ క్యూటీ మరెవరో కాదు యాంకర్ లాస్య
కాగా యాంకర్ లాస్య అసలు పేరు సౌజన్యా రెడ్డి ఆట. చ ఎన్ సీసీలోనూ ఆమె ట్రైనింగ్ తీసుకుందట. అంతే కాదు ఫైరింగ్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించిందట. బి గ్ బాస్ సీజన్ లో ఉన్నప్పుడు యాంకర్ లాస్యనే స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఎన్ సీసీ డ్రెస్ లో తన చిన్నప్పటి ఫొటోను కూడా అందులో షేర్ చేసింది.
ఉగాది సంబరాల్లో లాస్య ఫ్యామిలీ..
View this post on Instagram
కాగా ప్రస్తుతం టీవీ షోలకు దూరంగా ఉంటోంది లాస్య. అయితే తన భర్తతో కలిసి ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. లాస్య టాక్స్ అంటూ పలు ఆసక్తికరమైన వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.
తిరుమల శ్రీవారి మెట్లు ఎక్కుతూ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.