
ఇటీవల కశ్మిర్లో జరిగిన ఉగ్రదాడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాకిస్తాన్ ఉగ్రవాదులు చేత కానీ వారిలాగా అమాయకులపై విరుచుకుపడ్డారు. దీంతో దేశ వ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులను కట్టడి చెయ్యాలంటూ దేశావ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇప్పటికే అధికారులు ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. భారత సైనికులు రంగంలో దిగారు. ఉగ్రవాదుల వేట మొదలు పెట్టారు. ఇక పోతే కశ్మిర్ ఉగ్రదాడిలో చనిపోయిన వారికి ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో నివాళి జరిగింది.
ఈ క్రమంలో MAA మాజీ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అండ్ సీనియర్ నటుడు మురళి మోహన్ గారు మాట్లాడుతూ.. ఈ ఉగ్రదాడి చాలా దురదృష్టకరమైన పరిణామం అన్నారు. ప్రశాంతకరమైన భారతదేశంలో ఇలాంటి దాడులు జరగడం చాలా బాధాకరం అన్నారు. ఈ దాడికి ప్రపంచం మొత్తం కూడా బాధకు గురయ్యింది అన్నారు. మన దేశంలో మంచి మంచి పర్యాటక ప్రదేశాలు వున్నా, పక్క దేశాల వారు రావడానికి ఇష్టం చూపించట్లేదు అన్నారు. దానికి కారణం మనలో మనకే తేడాలు అన్నారు. ఆ తేడాలు పక్కన పెట్టి అందరం ఒకటిగా ఉందాం అన్నారు. భారతీయులంతా ఒక్కటిగా ఐక్యమత్యంగా ఉందాం అని పిలుపునిచ్చారు. ఉగ్రవాదులను కట్టడి చెయ్యడానికి సిద్ధమైన అధికారులకు అండగా ఉందాం అని అన్నారు.
టిఎఫ్టిసి కార్యదర్శి ప్రసన్న గారు మాట్లాడుతూ జరిగిన ఘటనను తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదులపై నిప్పులు చెరిగారు. ఉగ్రవాదులను కట్టడి చెయ్యడం కోసం ఉన్న ప్రోగ్రాంలన్ని క్యాన్సిల్ చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇదే పనిగా పెట్టుకుని ముందుకు సాగుతున్నందుకు ప్రసన్న గారు ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి థాంక్స్ చెప్పారు.
ఇక తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు విడిచిన అమాయకులకు సానుభూతి ప్రకటించారు. బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ, తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా అవగాహన కల్పిస్తాం అంటూ హామీ ఇచ్చారు. ఈ ఘటనని సీరియస్ గా తీసుకొని ముందుకు వెళుతున్న ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య మంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే MAA అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ మాదల రవి గారు మాట్లాడుతూ..ఉగ్రదాడిపై విరుచుకుపడ్డారు. చనిపోయిన 26 మంది కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఉగ్రవాదులను కట్టడి చేసేందుకు సిద్ధమైన అధికారులకు మన దేశంలో ఉన్న 140 కోట్ల జనాలు సహకరించాలని కోరారు. ఇందుకు మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భరత్ భూషణ్ దామోదర్ ప్రసాద్, మురళి మోహన్, ప్రసన్న కుమార్, అనుపమ రెడ్డి మాదల రవి, వల్లభనేని అనిల్ , శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?
Tollywood: సినిమాలు వదిలేసి వాచ్మెన్గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..
Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..
Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..