
ప్రభాస్ ఫౌజి హీరోయిన్ ఇమాన్వీ, ఆర్జీవీ శారీ హీరోయిన్ ఆరాధ్య దేవి, పుష్ప 2 ఆంచల్ ముంజాల్, ఏజెంట్ హీరోయిన్ సాక్షి వైద్య.. ఇలా తదితర హీరోయిన్లందరూ తమ కెరీర్ ప్రారంభంలో ఇన్ స్టా గ్రామ్ రీల్స్ తో ఫేమస్ అయిన వారే.
ఇప్పుడీ జాబితాలోకి మరో సరికొత్త అందాల తార చేరింది. ఇన్ స్టా రీల్స్ తో బాగా ఫేమస్ అయి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ఎంట్రీతోనే అదరగొట్టింది.
ఈ ఇన్ స్టా గ్రామ్ బ్యూటీ నటించిన మొదటి సినిమాతో ఏకంగా రూ. 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. తను ఎవరో ఈ పాటికే చాలమందికి అర్థమై ఉంటుంది.
యస్.. ఈ కాకినాడ పిల్ల పేరు శ్రీదేవి అదేనండి కోర్టు సినిమా హీరోయిన్. ఈ బ్యూటీ పూర్తి పేరు శ్రీదేవి ఆపళ్ల.ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు.
శ్రీదేవి ఇన్స్టాగ్రామ్లో చేసిన ఓ రీల్ చూసి కోర్ట్ సినిమాలో ఆమెకు అవకాశం కల్పించారట.ఈ విషయాన్ని కోర్టు మూవీ డైరెక్టర్ రామ్ జగదీష్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఆడిషన్స్ లోనూ ఏ మాత్రం తడబాటు లేకుండా పర్ఫెక్ట్గా డైలాగులు చెప్పడంతో ఏ మాత్రం సందేహించకుండా జాబిలి పాత్రకు శ్రీదేవిని తీసుకున్నారట కోర్ట్ సినిమా మేకర్స్.