
ప్రస్తుతం మన దేశంలో అత్యుత్తమ ఆధునిక సినిమాలను తెరకెక్కిస్తోన్న దర్శకనిర్మాతలు చాలా మంది ఉన్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్… వాస్తవ సంఘటనలను సినిమా రూపంలో అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పాన్ ఇండియా చిత్రాల హావా మరింత పెరిగింది. ముఖ్యంగా వరల్డ్ దృష్టిని ఆకర్షించే చిత్రాలను తెరకెక్కించడంలో మన దర్శకులు ముందుంటున్నారు. హాలీవుడ్ మేకర్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్న సౌత్ డైరెక్టర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఆస్కార్ వేదికపై తెలుగు సినిమా గౌరవాన్ని నిలబెట్టాడు డైరెక్టర్ రాజమౌళి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, అట్లీ సైతం వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నారు. వీరిలో అట్లీ ఒకరు. ఇప్పటివరకు చేసింది ఆరు సినిమాలే అయినప్పటికీ 100 శాతం బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు.
రాజా రాణి సినిమా నుంచి మెర్సల్, బిగిల్, జవాన్ చిత్రాల వరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అట్లీ భారతీయ సినిమాలో తన స్థానాన్ని దృఢంగా సుస్థిరం చేసుకున్నాడు. 2023లో విడుదలైన జవాన్ అతడి కెరీర్లో ఒక మలుపు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. జవాన్ సినిమా తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన అట్లీ.. ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. AA22 X A6 పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతోపాటు అట్లీ పారితోషికం కూడా పెరిగిందని అంటున్నారు.
జవాన్ సినిమాకు రూ.30 కోట్లు పారితోషికం తీసుకున్న అట్లీ.. ఇప్పుడు AA22 X A6కు రూ.100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం ఈ విషయం 2025 నాటికి భారతదేశంలో అత్యధికంగా చెల్లించే డైరెక్టర్లలో మూడవ స్థానంలో నిలిచింది.
మన దేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న డైరెక్టర్స్ వీరే..
- ఎస్.ఎస్. రాజమౌళి – ఒక్కో సినిమాకు రూ. 200 కోట్లు
- సందీప్ రెడ్డి వంగా – ఒక్కో సినిమాకు రూ. 100 నుండి 150 కోట్లు
- అట్లీ – ఒక్కో సినిమాకు 100 కోట్లు
- రాజ్ కుమార్ హిరానీ – 80 కోట్లు
- సుకుమార్ – రూ. 75 కోట్లు
- సంజయ్ లీలా భన్సాలీ – రూ. 55-65 కోట్లు
ఇవి కూడా చదవండి :
Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్
Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‌లోకి.. పరుగు మూవీ హీరోయిన్ను ఇప్పుడే చూస్తే షాకే..
Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..
OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?