మలయాళీ నటి విన్సీ సోనీ అలోషియస్.. పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తనకు గతంలో ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక సినిమ సెట్స్ లో ఓ హీరో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. కానీ అతడి పేరు వెల్లడించలేదు.
సినిమా షూటింగ్ సమయంలో ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నాడని.. తనతో అనుచితంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది విన్సీ సోనీ అలోషియస్. ఆ మూవీ షూటింగ్ జరిగినన్ని రోజులు తాను ఎంతో ఇబ్బందిపడ్డానని.. తన ముందే దుస్తులు మార్చుకోవాలని ఇబ్బందిపెట్టాడని తెలిపింది.
అందరి ముందే అలాంటి మాటలు మాట్లాడేవాడని.. తన జీవితంలో అది ఒక అసహ్యకరమైన సంఘటన అనే చెప్పుకొచ్చింది. ఆ ఘటన తర్వాత డ్రగ్స్ అలవాటు ఉన్న నటులతో కలిసి నటించకూడదని నిర్ణయించుకున్నానని తెలిపిందే.
తాను తీసుకున్న నిర్ణయం వల్ల తనకు భవిష్యత్తులో సినిమాల్లో అవకాశాలు రాకపోవచ్చని.. కానీ ఈ విషయాన్ని బహిరంగంగానే చెబుతున్నానని తెలిపింది. తనతో అలా ప్రవర్తించిన నటుడి గురించి అందరికీ తెలుసునని.. కానీ ఎవరూ స్పందించలేదని తెలిపింది.