
ఒకప్పుడు సినీరంగంలో పాపులారిటి ఉన్న హీరోయిన్. బుల్లితెరపై అనేక సీరియల్స్ చేస్తూ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రేమ కోసం తన కెరీర్ వదిలేసింది. కానీ భర్త చేతిలో దారుణంగా మోసపోయింది. అతడితో విడాకులు తీసుకుని ఇప్పుడు కొడుకుతో కలిసి ఒంటరిగా జీవిస్తుంది. ఆమె మరెవరో కాదు.. జెన్నిఫర్ వింగెట్. ఒకప్పుడు టీవీల్లో చాలా ఫేమస్ అయిన నటి. ఆమె మాజీ భర్త కరణ్ సింగ్ గ్రోవర్. వారిద్దరూ ‘దిల్ మిల్ గయే’ అనే మెడికల్ సిరీస్లో కలిసి పనిచేశారు. ఆ సమయంలో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 2012 లో వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్లలోనే వారి బంధం తెగిపోయింది. చివరకు 2014లో విడాకులు తీసుకున్నారు.
ప్రేమ, పెళ్లి కోసం తన కెరీర్ వదిలేసింది జెన్నిఫర్. అప్పట్లో తాను సినిమాలు వదిలేయవద్దని తన సన్నిహితులు చెప్పారని.. కానీ గృహిణిగా ఉండేందుకు.. తన ప్రేమ కోసమే కెరీర్ వదిలేశానని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. జెన్నిఫర్ నేడు టీవీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. జెన్నిఫర్ చిన్న వయసులోనే నటనా రంగంలోకి అడుగుపెట్టింది. మొదటిసారిగా అమీర్ ఖాన్, మనీషా కొయిరాలా నటించిన ‘అకేలే హమ్ అకేలే తుమ్’ (1995) చిత్రంలో వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత హిందీలో పలు చిత్రాల్లో నటించింది.
జెన్నిఫర్ కసౌతీ జిందగీ కి సీరియల్ ద్వారా ఎక్కువగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత సరస్వతి చంద్ర, బేహాద్ వంటి సీరియల్స్ ద్వారా జనాలకు దగ్గరయ్యింది. ప్రస్తుతం టీవీ పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా మారింది. ఇక జెన్నిఫర్ తో విడాకుల తర్వాత కరణ్ 2016లో బిపాసా బసును వివాహం చేసుకున్నాడు. కరణ్ ఇటీవల ‘ఫైటర్’ సినిమాలో కనిపించాడు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..