
బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆ అమ్మడు.. ఇప్పుడు అనేక సీరియల్స్ చేస్తూ తనకంటూ స్టార్ట్ డమ్ సంపాదించుకుంది. తాజాగా ప్రేమ, పెళ్లి, పిల్లల గురించి ఆమె చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో తెలుసా.. తనే టీనా దత్త. కలర్స్ టీవీ ‘ఉత్తరన్’ సీరియల్ ద్వారా చాలా పాపులర్ అయ్యింది టీనా దత్త. ఈ సీరియల్స్ ఎన్నో టీఆర్పీ రికార్డులను బద్దలు కొట్టింది. ప్రస్తుతం టీనా దత్తా ఒంటరిగా ఉంటుంది. తనకు మింగిల్ అయ్యే ఉద్దేశ్యం లేదంటూ ఆసక్తికర కామెంట్స్ చేస్తుంది. టీనా తన ఫ్యూచర్ ప్లానింగ్ గురించి మాట్లాడుతూ.. ఒంటరి తల్లి కావడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ప్రస్తుతం తాను పెళ్లి చేసుకోకుండానే ఎవరితోనైనా తల్లి కాగలనని ఆలోచిస్తున్నానని చెప్పింది. ఈ సమయంలో తాను పెళ్లి చేసుకోవడానికి ఏమాత్రం తొందరపడడం లేదని చెప్పుకొచ్చింది. కానీ భవిష్యత్తులో మాత్రం దత్తత తీసుకోవడం లేదా అద్దె గర్భం ద్వారా తల్లి కావాలని ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.
టీనా మాట్లాడుతూ.. “నేను మంచి తల్లిని కాగలనని నమ్ముతున్నాను. కానీ ప్రస్తుతానికి నేను దాని గురించి ఆలోచించలేదు. ఎలాంటి ప్రణాళిక లేదు. కానీ సరైన సమయం వచ్చినప్పుడు, నేను మంచి తల్లిగా నిరూపించుకుంటానని అందరూ చూస్తారు. నేను ఒంటరి తల్లిగా ఉండగలనా అనే ఆలోచన చేయలేదు. బిడ్డను దత్తత తీసుకున్నా.. లేదా సరోగసీ ద్వారా తల్లి కావాలనుకుంటున్నాను. ” అంటూ చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి
తాను సుస్మితా సేన్ కు పెద్ద అభిమానినని తెలిపింది. ఆమె ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకున్న తీరు చూసి తాను సైతం దత్తత తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. తన నిర్ణయానికి తల్లిదండ్రులు సైతం మద్దతుగా ఉంటారని.. భవిష్యత్తులో తాను సరోగసీ ద్వారా తల్లి కావడం లేదా.. బిడ్డను దత్తత తీసుకున్నప్పటికీ తన తల్లిదండ్రులు తన అభిప్రాయాన్ని గౌరవిస్తారని చెప్పుకొచ్చింది. తన కుటుంబాన్ని ఒంటరిగా చూసుకోగలిగితే, తన పిల్లలను కూడా ఒంటరిగా చూసుకోవచ్చని టీనా చెప్పింది. తనను తాను చూసుకోవడానికి భర్త అవసరం లేదని. తన పిల్లల బాధ్యత తీసుకోవడానికి తనకు భర్త సహాయం అవసరం లేదు, ఈ బాధ్యతను నెరవేర్చడానికి ఆమె మాత్రమే సరిపోతుందని తెలిపింది.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..