
టాలీవుడ్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని హీరోయిన్. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో ఆఫర్స్ అందుకోలేదు. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. అయితే ఇటీవలే ఓ సినిమా చిత్రీకరణలో ఓ నటుడితో ఇంటిమేట్ సీన్ చేయడానికి భయపడి ఇంటికి పారిపోయిందట. ఆమె మరెవరో కాదు.. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే. తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. ఇటీవలే మహారాజ్ చిత్రంలో నటించింది. సిద్దార్థ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షాలిని పాండేతోపాటు జునైద్ ఖాన్, జైదీప్ ఆహ్లావత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది షాలిని. అయితే ఇంటిమేట్ సీన్స్ లో నటించడం అంత సులభం కాదని షాలిని చెప్పుకొచ్చింది.
ఈ చిత్రంలో నటుడు జైదీప్ తో ఇంటిమేట్ సీన్ చేయాల్సి ఉందని.. ఆ సీన్ షూట్ చేసే ముందు తాను బయటకు పరుగెత్తి పారిపోయానని తెలిపింది. ఆ సమయంలో ఒత్తిడిగా అనిపించిందని.. అలాంటి వాతావరణం.. చీకటి ఉన్నప్పుడు యాక్టింగ్ చాలా భయం వేసిందని.. దీంతో తనకు ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానని.. ఆయన అర్థం చేసుకుని తనకు స్పేస్ ఇచ్చారని తెలిపింది. దీంతో ఆ సీన్ లో నటించగలిగానని చెప్పుకొచ్చింది. ఈ సినిమాను 1800 కాలంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా సిద్దార్థ్ మల్హోత్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. జైదీప్ ఈ చిత్రంలో స్త్రీలని లైంగిక వేధింపులకు పాల్పడే వ్యక్తిగా నటించారు.
మహారాజ్ సినిమాలో కిషోరి పాత్రను పోషించింది. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత మహానటి, ఇద్దరి లోకం ఒకటే వంటి చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో హిందీలోకి వెళ్లింది. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..