టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ యమున. ఈతరం ప్రేక్షకులకు సీరియల్ నటిగా మాత్రమే పరిచయం. కానీ ఒకప్పుడు ఆమె తెలుగులో క్రేజీ హీరోయిన్. తక్కువ సమయంలోనే వరుస అవకాశాలు అందుకుని తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ వ్యభిచారం కేసులో ఆమె పేరు రావడంతో కెరీర్ ఊహించని మలుపులు తిప్పింది. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె తర్వాత సీరియల్స్ ద్వారా రీఎంట్రీ ఇచ్చింది. నటి యమున తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఒకప్పుడు అద్భుతమైన నటనతో మెప్పించిన ఆమె, జీవితంలో కొన్ని తీవ్రమైన ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా 2011 జనవరిలో జరిగిన బెంగుళూరు సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని యమున తెలిపారు. ఆ సంఘటనలో తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, తనను తప్పుగా చిత్రీకరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో తాను మానసికంగా కుంగిపోయానని అన్నారు. ఈ పరిణామాలు ఆమెను ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనల వరకు తీసుకెళ్లాయని, పిల్లల కోసం వీలునామా కూడా రాశానని చెప్పారు. అయితే, ఒక స్నేహితురాలు ఇచ్చిన సలహా – “నువ్వు నీ పిల్లల కోసం బ్రతకాలి” – ఆమెకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అప్పుడు ఆ కేసులో న్యాయం గెలిచి, తాను నిర్దోషి అని నిరూపించుకున్నానని యమున అన్నారు. ప్రస్తుతం ఒక కొత్త అవతారంలో టీవీలో కనిపిస్తున్న ఆమె, తన నిశ్శబ్ద పోరాటం నుండి ధైర్యంగా బయటపడ్డారు.
ఒక సందర్భంలో, తాను డ్రైవర్‌తో ప్రయాణిస్తున్న టాటా సఫారి కారుకు ప్రమాదం జరిగిందని, ఆ ప్రమాదంలో చనిపోయి ఉంటే బాగుండేది అనిపించిందని ఆమె గుర్తు చేసుకున్నారు. తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటనగా 2011 జనవరి 20న జరిగిన బెంగుళూరు ఉదంతాన్ని యమున పేర్కొన్నారు. సీసీబీ కార్యాలయం నుండి తనకు అనుమానాలు ఎదురయ్యాయని, ఎవరో కావాలనే తనను ఇరికించారని ఆమె చెప్పారు. అక్కడి సీసీబీ అధికారులకు కూడా అసలు నిజం తెలుసని, కానీ దాని గురించి పోరాడి బయటకు రావడానికి ఐదు సంవత్సరాలు అజ్ఞాతంలో గడపాల్సి వచ్చిందని తెలిపారు. తాను 100 శాతం తప్పు చేయలేదని, ఈ విషయం తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, దేవుడికి తెలుసని యమున స్పష్టం చేశారు.
ఈ సంఘటన తరువాత తనను విపరీతంగా వేధించిందని, తప్పుడు ప్రచారాలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రచారం వల్ల తన కుటుంబం, చిన్న పిల్లలు మానసికంగా ఎంతగానో నష్టపోయారని, ఒక మనిషి వల్ల రెండు, మూడు తరాలు కూడా వెనక్కి వెళ్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లి, ఒక వారం పాటు నిద్రలేని రాత్రులు గడిపానని, 2012 ఫిబ్రవరిలో మణిపాల్ హాస్పిటల్లో చేరాల్సి వచ్చిందని తెలిపారు. డిప్రెషన్‌కు మందులు వద్దు అనుకుంటూ, ఆసుపత్రిలో కూడా తీవ్ర ఆవేదనకు గురయ్యానని యమున చెప్పారు. ఆమె భర్త కుటుంబ సభ్యులు తమిళనాడుకు తరలివెళ్లారని, అక్కడ మూడు, నాలుగు రోజులు ఆమెను ఓదార్చారని తెలిపారు. ఒక సందర్భంలో ఆమెకు అన్నం తినిపిస్తుంటే విషంలా అనిపించిందని, ఆ క్షణాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఈ బాధలన్నీ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నానని, పిల్లల కోసం వీలునామా కూడా రాశానని యమున వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి: Rambha: హీరోయిన్ రంభకు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. ఫోటోస్ వైరల్..
Yamuna New
ఎక్కువ మంది చదివినవి: Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?
