
తెలుగులో మసూద సినిమాతో ప్రేక్షకులను భయపెట్టించింది హీరోయిన్ బాంధవి శ్రీధర్. చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో దెయ్యం పట్టిన అమ్మాయిగా అద్భుతమైన నటనతో కట్టిపడేసింది. అయితే సినిమాల్లో దెయ్యం పట్టినట్లుగా పిచ్చిగా కనిపించిన బాంధవి శ్రీధర్ సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ క్వీన్. ఇప్పుడు మరో అమ్మాయి సైతం నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఇటీవల హీరో ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన శబ్దం సినిమాలో కనిపించింది ఈ అందాల రాక్షసి. ఫిబ్రవరిలో విడుదలైన ఈ శబ్దం సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆది పినిశెట్టి, డైరెక్టర్ అరివళగన్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబోలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. 7G ఫిల్మ్స్ సివా & ఆల్ఫా ఫ్రేమ్స్ బ్యానర్లపై అరివళగన్ ఈ సినిమాను నిర్మించాడు.
హారర్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో దెయ్యంగా కనిపించింది ఓ అందాల అప్సరస. ఆమె పేరు ఆర్తి అశ్విన్. తమిళ చిత్రపరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ముద్దుగుమ్మ. తమిళనాడులోని మైలదుత్తురైలో జన్మించిన ఈ వయ్యారి.. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేని కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గాయని కావాలనేది ఆమె కల.. అనుకోకుండా నటిగా మారింది. కాలేజీ రోజుల్లోనే టెలివిజన్ రియాల్టీ షోలకు అడిషన్స్ ఇచ్చింది. ఆ తర్వాత బుల్లితెరపై పలు షోలలో సందడి చేసింది.
ఇవి కూడా చదవండి
మోహన్ జి దర్శకత్వం వహించిన “రుత్రతాండవం” చిత్రంతో నటిగా వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె రిపోర్టర్ పాత్రను పోషించింది. ఈ మూవీ తర్వాత ఆర్తి అశ్విన్ కు మరింత క్రేజ్ వచ్చింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆర్తి అశ్విన్.. ఇప్పుడు శబ్దం సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఇందులో ఆమెను అసలు గుర్తుపట్టలేనంతగా చూపించారు మేకర్స్. తన మేకప్ కోసమే గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినట్లు చెబుతుంది ఆర్తి. ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులోనూ నటించేందుకు సిద్ధంగా ఉన్నానంటోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ బ్యూటీ క్రేజీ గ్లామర్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..
ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..