పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నవీల్ చైర్ లో ప్రత్యక్షమైంది. బుధవారం (జనవరి 22) శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమె కనీసం నడవలేకపోయారు. కారు దిగేటప్పుడు కూడా ఒంటి కాలితోనే ఇబ్బంది పడుతూ నడిచారు. ఇటీవల జిమ్లో వర్కౌట్స్ చేస్తుండగా రష్మిక మందన్న కాలు బెణికింది. అయితే అప్పుడు గాయం చిన్నదేనని అనుకున్నారు. అయితే ఎయిర్ పోర్టులో రష్మిక పరిస్థితి చూస్తుంటే గాయం పెద్దదిగానే, తీవ్రంగానే ఉన్నట్లు సమాచారం. ఎయిర్ పోర్టులో రష్మిక లేటెస్ట్ విజువల్స్, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతు్నాయి. వీటిని చూసిన ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రష్మిక మందన్న త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.
ఎయిర్ పోర్టులో రష్మిక మందన్నా.. వీడియో..
Rashu was spotted in a wheelchair at the airport due to a leg injury 🥺🫂
We cannot see you in these conditions @iamRashmika 😩
Wishing her a speedy recovery 🙏🏻❤️#RashmikaMandanna pic.twitter.com/NgGiZHBwSwఇవి కూడా చదవండి
— Rashmika Lover’s❤️🩹 (@Rashuu_lovers) January 22, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
