
దివ్య భారతి.. కన్నడలో ఫేమస్ హీరోయిన్. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ నటించిన బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే రొమాంటిక్ సీన్లతో రెచ్చిపోయి ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యింది.
దీంతో తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం సుడిగాలి సుధీర్ సరసన గోట్ చిత్రంలో నటిస్తుంది దివ్య భారతి. ఈ సినిమాతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయం కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రానున్నాయి.
మరోవైపు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలతో అరాచకం సృష్టిస్తుంది హీరోయిన్. రెగ్యులర్ గా స్టన్నింగ్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా చీరకట్టులో మోడ్రన్ లుక్ లో మతిపోగొట్టేస్తుంది.
ఇటీవల కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో దివ్య భారతి పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో ఈ బ్యూటీ ప్రేమలో ఉందని ప్రచారం నడిచింది. ఈ రూమర్స్ ను ఇద్దరూ ఖండించారు.