
దర్శకుడు అనిల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ఓ ప్రాజెక్ట్ రాబోతున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా ఉగాది సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అనిల్ రావిపూడి ఇప్పుడు చిరంజీవితో కలిసి సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. మెగాస్టార్‌ను విపరీతంగా ఆకట్టుకున్న స్క్రిప్ట్ ఇప్పటికే లాక్ అయిందని అనిల్ రావిపూడి ప్రకటించారు. ఇదంతా పక్కనపెడితే ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ముందుగా, క్రేజీ నటి అదితి రావు హైదరి పేరు తెరపైకి వచ్చింది. ఇటీవలే డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆమెతో చర్చించినట్లుగా టాక్.
ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. ఆమె గతంలో రెండుసార్లు టాలీవుడ్ దర్శకులకు నో చెప్పింది. ఆమె మరెవరో కాదు పరిణీతి చోప్రా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో సీత పాత్ర కోసం మొదట పరిణీతి చోప్రాను సంప్రదించారట. కానీ ఆ పాత్రలో నటించే వ్యవధి చాలా తక్కువగా ఉందని పరిణీతి ఆ పాత్రను తిరస్కరించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాను సైతం పరిణితి రిజెక్ట్ చేసింది. దీంతో ఆమె స్థానంలోకి రష్మికను తీసుకున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు చిరంజీవి సినిమా కోసం అనిల్ రావిపూడి పరిణీతి చోప్రాతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్. అదితి రావు హైదరీ, పరిణీతి చోప్రా.. ఇద్దరిలో ఎవరు ఈ సినిమాలో కనిపించనున్నారనేది సస్పెన్స్ గా మిగిలిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో త్రిష కథానాయికగా నటిస్తుంది.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చేసిన ఒక్క సినిమా డిజాస్టర్.. కట్ చేస్తే.. అమ్మడు జోరు ఇప్పట్లో ఆగేలా లేదుగా..
Tollywood: గ్లామర్ షోతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. వరుస సినిమాలు చేస్తున్న రానీ క్రేజ్.. ఆఫర్స్ కోసం..
Ram Charan : రామ్ చరణ్ ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా సెన్సేషన్.. కానీ ఇప్పుడు..
Actress Laya: హీరోయిన్ లయ కూతురిని చూశారా.. ? అప్పుడే సినిమాల్లోకి వచ్చేసిందిగా.. ఫోటోస్ చూస్తే..
Tollywood: తెలుగులో జోరు పెంచిన యంగ్ హీరోయిన్.. అమ్మడు ఇప్పట్లో ఆగేలే లేదుగా..