
అయ్యా బాబోయ్.. ఈ ముద్దుగుమ్మను గుర్తుపట్టడం కష్టమే. ప్రస్తుతం సినీరంగంలో టాప్ హీరోయిన్. అంతేకాదు.. సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో ఈ బ్యూటీ ఒకరు. తెలుగు, తమిళం ఎన్నో సినిమాల్లో నటించింది.
ఆ వయ్యారి ఇంకెవరు.. టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్. ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని సరసన నేను శైలజా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత కీర్తి సురేష్ ఇటు ఎన్న మాయం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది.
తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. అలాగే సుమన్ కుమార్ దర్శకత్వంలో రఘుదత్తా మూవీలో నటించి మరోసారి ప్రశంసలు అందుకుంది.
ఇటీవలే బేబీ జాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో హిందీ సినీరంగంలోకి కీర్తికి అదృష్టం కలిసిరాలేదు.
ఇదిలా ఉంటే.. గతేడాది డిసెంబర్ నెలలో తన స్నేహితుడు ఆంటోనిని పెళ్లి చేసుకుంది కీర్తి. వీరిద్దరి వివాహనికి టాలీవుడ్, కోలీవుడ్ హీరోహీరోయిన్స్ హాజరైన సంగతి తెలిసిందే.