
ఆమె పాన్ ఇండియా హీరోయిన్. కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాదు హిందీలోనూ వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. కట్ చేస్తే.. టాలీవుడ్ హీరోను ప్రేమించి పెళ్లి చేసుకుంది. తనే శోభిత ధూళిపాళ్ల.
కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి పాపులర్ అయ్యింది. హిందీలో రామం రాఘవం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించిన శోభితా తెలుగులోనూ నటించింది.
తెలుగుతోపాటు హిందీ, తమిళం భాషలలో పలు సినిమాలు చేసిన శోభితా.. గతేడాది అక్కినే హీరో నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం కుటుంబ సభ్యులు, స్నేహితులు, సమక్షంలోనే జరిగింది.
గత రెండేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారట. 2022లో మొదటిసారి పరిచయమయ్యారట. ఆ తర్వాత ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరు కుటుంబసభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.
ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు చైతన్య. మరోవైపు పెళ్లి తర్వాత కూడా శోభితా సినిమాల్లో నటిస్తుంది. ఇటీవలే వీరిద్దరు కలిసి వోగ్ మ్యాగజైన్ కోసం చేసిన ఫోటోషూట్ తెగ వైరలయ్యింది.