
సినీరంగంలో తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలనటిగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ 16 ఏళ్లకే ఫేక్ వీడియోస్ భారిన పడింది. అయినప్పటికీ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతుంది.
హీరోయిన్ గా కెరీర్ ప్రారంభంలోనే సైబర్ నేరగాళ్ల చేతిలో పడింది. చిన్న వయసులోనే ఆమె ఫేక్ వీడియోస్, ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. కానీ వచ్చిన ప్రతి సమస్ను అధిగమించి ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గా బిజీగా ఉంటుంది.
ఆమె మరెవరో కాదు.. అనిఖ సురేంద్రన్. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కూతురిగా విశ్వాసం సినిమాతో మరింత పాపులర్ అయ్యింది. ఈఒక్క సినిమాతోనే బాలనటిగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది.
అయితే 16 ఏళ్ల వయసులోనే ఫేక్ వీడియోస్ భారిన పడింది. కానీ ఆ ఫోటోస్, వీడియోస్ ఫేక్ అని తేలిపోయింది. ఇక ఆ తర్వాత 18 ఏళ్లకే హీరోయిన్ గా సినీరంగంలోకి రీఎంట్రీ ఇచ్చింది.
తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో అలరించింది. ప్రస్తుతం హీరోయిన్ గా సరైన అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అలాగే అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ ఫోటోస్ అప్లోడ్ చేస్తుంది.