
సినిమాలు, టీవీ సీరియల్స్ లో కలిసి నటించిన నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం. ఒకప్పుడు పలు చిత్రాలు, సీరియల్లలో కలిసి పనిచేసిన చాలా మంది ఇప్పుడు భార్యభర్తలు. అటు తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతూనే.. మరోవైపు వృత్తిపరంగానూ బిజీగా ఉంటున్నారు. సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ చిగురించడం సర్వసాధారణం. కానీ ఈ జంట కథ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే.. వీరిద్దరు తల్లికొడుకులుగా నటించారు. కానీ రియల్ లైఫ్ లో వీరు పెళ్లి చేసుకున్నారు. అంతేకాదు ఈ సీరియల్ హీరోయిన్ తనకంటే 8 ఏళ్లు చిన్నవాడైన నటుడిని వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. వారిద్దరు మరెవరో కాదు.. ప్యార్ కీ యే ఏక్ కహానీ అనే హిందీ సీరియల్లో నటించిన కిశ్వర్ మర్చంట్, సుయ్యాష్ రాయ్.
ప్యార్ కీ యే ఏక్ కహానీ అనే హిందీ సీరియల్లో నటి కిశ్వర్ మర్చంట్ తల్లి పాత్రను పోషించగా.. అదే సీరియల్లో నటుడు సుయ్యాష్ రాయ్ కొడుకు పాత్రలో కనిపించాడు. ఈ సీరియల్ 2010 నుంచి 2011 వరకు ప్రసారం అయ్యింది. వీరిద్దరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. కానీ ఈ ఇద్దరూ ప్రేమలో పడతారని ఎవరూ ఊహించలేదు. కిశ్వర్ తనకంటే 8 సంవత్సరాలు చిన్నవాడైన సుయాష్‌ను వివాహం చేసుకుంటానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. కిష్వర్ మర్చంట్ ముస్లిం. సుయ్యాష్ ఒక పంజాబీ కుటుంబానికి చెందిన అబ్బాయి. వీరి పెళ్లికి మతం ఎప్పుడూ అడ్డు కాలేదు. ఇద్దరూ 2016 లో వివాహం చేసుకున్నారు.
అయితే వీరి పెళ్లికి మొదట్లో సుయ్యాష్ తల్లిదండ్రులు వ్యతిరేకించారు. తన కాబోయే కోడలు తన కొడుకు కంటే 8 సంవత్సరాలు పెద్దది కావడంతో వీరి పెళ్లికి సుయ్యాష్ పేరెంట్స్ ఒప్పుకోలేదు. కానీ తల్లిదండ్రులను ఒప్పించిన తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో ఈ జంట ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొన్నారు. ఇద్దరి మధ్య వయసు అంతరాన్ని చాలా మంది విమర్శించారు. ఇద్దరూ హిందీలో అనేక సీరియల్స్, సినిమాల్లో నటించారు.
ఇవి కూడా చదవండి :
Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..
Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..
OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..