
బైక్ అండ్ కార్ రేసింగుల్లో పాల్గొనాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ పోటీల్లో చిన్న తప్పు జరిగినా ఘోర ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు గాల్లో ఉంటాయి. అందుకే ఈ రేసింగ్ గేమ్ లో పాల్గొనాలంటే డేరింగ్ అండ్ డ్యాషింగ్ పర్సన్సే అయి ఉండాలి. ప్రస్తుతం స్టార్ హీరో అజిత్ కుమార్ కార్ రేసుల్లో రయ్ రయ్ మంటూ దూసుకెళుతున్నాడు. ప్రమాదాలు జరుగుతున్నా జంకకుండా వరుసగా పోటీల్లో పాల్గొంటున్నాడు. తాజాగా ఇటలీలో జరిగిన పోటీల్లోనూ అజిత్ అండ్ టీమ్ మూడో స్థానంలో నిలిచింది. అయితే సినిమా ఇండస్ట్రీలో అజిత్ తో పాటు మరో టాలీవుడ్ హీరోయిన్ కూడా కారు రేసుల్లో సత్తా చాటుతోంది. చిన్నప్పటి నుంచి కార్లపై మోజు పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ ఫార్ములా కార్ రేస్ కార్ ట్రైనింగ్ ప్రోగ్రాం లెవల్ 1ని పూర్తి చేసింది. ఇప్పటికే ఈ పోటీల్లో పలు పతకాలు కూడా సాధించింది. ప్రస్తుతం సినిమాలతోనే బిజిగా ఉంటోన్న ఈ ముద్దుగుమ్మ తీరిక దొరికనప్పుడల్లా కారు రేసుల్లో పాల్గొంటోంది. మరి ఈ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? తను మరెవరో కాదు తెలుగుతో పాటు తమిళ్ లో వరుసగా సినిమాలు చేస్తోన్న నివేదా పేతురాజ్.
నిజం చెప్పాలంటే నివేదా పేతురాజ్ మల్టీ ట్యాలెంటెడ్ వుమన్. తన నటనతో ఆకట్టుకోవడమే కాకుండా కార్ రేసింగ్, బ్యాడ్మింటన్ పోటీల్లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఈ మధ్యన తన తమ్ముడితో కలిసి ఫార్ములా కారు రేసింగ్‌లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది. ” గతంలో కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ లకు సంబంధించి నన్ను చాలా మంది సంప్రదించారు. అయితే ఈ గేమ్ లో పాల్గొనాలంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి. డబ్బుతో పాటు ఎంతో అంకిత భావం ఉంటేన ఈ గేమ్ లో సత్తా చాటగలం. ముఖ్యంగా ఇది ఖరీదైన క్రీడ ఎందుకంటే ప్రతి రేసుకు దాదాపు రూ.15 లక్షలు ఖర్చవుతుంది. అందుకే అన్ని విధాలా ఆలోచించే కార్ రేసుల్లో పాల్గొంటాను’ అని ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది నివేద.
ఇవి కూడా చదవండి
నివేద పేతురాజ్ లేటెస్ట్ ఫొటోస్..
ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది నివేద పేతురాజ్. చివరిగా ఆమె నటించిన పరువు వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.