
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా లైలా. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ శుక్రవారం (జనవరి 31) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. మెట్ల మార్గంలో తిరుమలకు చేరుకున్న అతను ఏడు కొండల స్వామికి మొక్కులు చెల్లించుకున్నాడు.
ఈ సందర్భంగా భక్తులు, సామాన్యులు విశ్వక్ సేన్ తో కలిసి ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. విశ్వక్ కూడా ఎంతో ఓపికగా భక్తులతో ఫొటోలు దిగి వారి కళ్లల్లో ఆనందం నింపాడు.
విశ్వక్ సేన్ తిరుమల శ్రీవారి పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
ఇక లైలా సినిమా విషయానికి వస్తే.. ఇందులో విశ్వక్ సేన్ సరసన ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటించింది. రామ్ నారయణ్ దర్శకత్వం వహించారు.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ సోనూ, లైలా అనే పాత్రల్లో కనిపించనున్నాడు. ఇప్పటికే లేడీ గెటప్‌లో విశ్వక్ సేన్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.